LATEST Join RVA Research for a reading at no-cost. Learn more
Vignana Course

Beginner's Roadmap to Astrology

జ్యోతిష్యం అనే మహా సముద్రాన్ని ఈదడానికి ఒక సరైన మార్గదర్శకం.

A guide to navigating the vast ocean of Astrology.

"రవీ, జ్యోతిష్యం అనేది ఒక పెద్ద సముద్రం లాంటిది. అందులో ఈదడం నేర్చుకోవాలంటే ముందుగా ప్రాథమిక సూత్రాలనే ఒడ్డున నిలబడాలి..."

— రవి అనే విద్యార్థి పుస్తకాలు చూసి భయపడినప్పుడు, గురువుగారు ఇచ్చిన మార్గనిర్దేశం ఇది.

ఉపోద్ఘాతం

జ్యోతిష్యం వల్ల ఉపయోగాలు మాట్లాడుకున్నాం, ఇప్పుడు ఏం నేర్చుకుంటే జ్యోతిష్య ఫలితం చెప్పగలుగుతామో చెప్తాను.

జ్యోతిష్యం

కాలాన్ని (భూత, భవిష్యత్, వర్తమానాలు) ఊహించడం మానవమాత్రులకు సాధ్యం కాదు. ఋషులు, మునులు, మహర్షులు వంటి వారికి మాత్రమే సాధ్యం.

మనకు ఎటువంటి అదృష్టం కలిగిందో తెలియదు గానీ, ఆ మహర్షులు వారి తపోశక్తితో మానవ మాత్రులకు సైతం కాలం యొక్క జ్ఞానాన్ని, కర్మ యొక్క జ్ఞానాన్ని గ్రహాల ఆధారంగా విశ్లేషించడానికి మార్గం చూపించారు.

ఏ సందర్భాల్లో జ్యోతిష్యాన్ని ఎలా వాడొచ్చు?

మనిషి జీవితాన్ని 12 భావాలతో జ్యోతిష్యం వివరించింది. ఆ ప్రతి సందర్భాన్ని జ్యోతిష్యం ద్వారా ఫలితాన్ని చెప్పొచ్చు, కాకపోతే దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి అనేది చాలా ముఖ్యం.

ఉదాహరణకు నీటిని కిందకు వదిలితే అవి పల్లానికి వెళ్తాయని చెప్తారు, కానీ అవి కుడి వైపు వెళ్తాయా, ఎడమవైపు వెళ్తాయా అని కొన్ని సందర్భాల్లో చెప్పడం కష్టంగా ఉంటుంది. జ్యోతిష్యం కూడా అలాగే.

జీవిత సందర్భాలు

1 ఆరోగ్యం
2 విద్య
3 కుటుంబం
4 ఉద్యోగం / వ్యాపారం
5 ధనం
6 స్థిరత్వం, గృహం
7 వివాహం
8 సంతానం
9 ఖర్చులు, సమస్యలు
10 దైవానుగ్రహం, భక్తి

జీవితంలో సందర్భం ఏదైనప్పటికీ కూడా సహజంగా మనం చేసిన ప్రయత్నానికి లేదా కష్టానికి తగిన విధంగా ఫలితాన్ని పొందుతాం.

అదృష్టం

చేసిన కష్టానికి 10 రెట్లు ఎక్కువగా ఫలితాన్ని పొందుతాం.

కష్టానికి తగ్గ ఫలితం

చేసిన కష్టానికి తగిన ఫలితం పొందడం.

దురదృష్టం

పది రెట్లు కష్టానికి ఒక రెట్టు ఫలితం లేక ఫలితం రాకపోవడం.

జ్యోతిష్యపరంగా ప్రతి సందర్భంలో పైన వివరించిన విధంగా మన సమయం ఎలా ఉందో తెలుసుకోవచ్చు.

జోతిష్యానికి ఆధారం

ప్రపంచంలో ఒక ప్రదేశానికి చేరుకోవడానికి అనేక మార్గాలు ఉంటాయి, ఏ మార్గంలో వెళ్ళినా ఏ వాహనం లో వెళ్ళినా అనుకున్న ప్రదేశానికి చేరుకుంటాం.

అన్ని జ్యోతిష్య పద్ధతులకూ ఆధారం: రాశులు, నక్షత్రాలు, గ్రహాలు, గ్రహ దృష్టులు, దశ

జ్యోతిష్యం నేర్చుకోవడానికి మార్గాలు

భవిష్యత్తుని చెప్పడానికి అనేక మార్గాలు ఉన్నాయి. ఖచ్చితమైన ఫలితం చెప్పడానికి 2 లేదా 3 మార్గాల లో పరిశీలించాల్సి ఉంటుంది.

జ్యోతిష్యాన్ని మూడు భాగాలుగా విడదీశారు:

సిద్ధాంత భాగం

గ్రహాలు వాటి స్థితి మరియు ఇతర గణితం.

ఫలిత భాగం

జన్మ సమయం ఆధారంగా భూత, భవిష్యత్, వర్తమానాన్ని తెలియజేయడం.

ముహూర్త భాగం

ఏ పనిని ఏ కాలంలో చేస్తే సంకల్పం కోటి రెట్లు బలపడుతుంది.

జ్యోతిష్యంలో పద్ధతులు

పరాశర జ్యోతిష్యం

ప్రపంచంలో ఉన్న అన్ని జ్యోతిష్య పద్ధతులకి ఇది తల్లి లాంటిది. గ్రహ స్థితి వల్ల కలిగే ఫలితాలు మరియు దశ రూపంలో కాలాన్ని నిర్ణయించే మార్గాలున్నాయి.

జైమినీ జ్యోతిష్యం

పరాశర మహర్షి నుంచి జైమిని మహర్షి నేర్చుకుని తనదైన శైలిలో ఫలిత నిర్ణయాన్ని ఎలా చేయాలని చెప్పడం జరిగింది.

నాడీ జ్యోతిష్యం

30 డిగ్రీలని 150, 300, 600 భాగాలుగా చేసి ఫలితనిర్ణయాన్ని సూక్ష్మంగా పరిశీలించి చెప్తారు. (భృగు నంది నాడీ, శివ నాడీ, మొదలైనవి).

కృష్ణమూర్తి పద్ధతి (KP)

ప్రశ్న జ్యోతిష్యం - ఒకే ఒక ముఖ్య విషయం గురించి ఖచ్చితంగా ఏమౌతుంది, ఎప్పుడు అవుతుంది అనే విషయం తెలుసుకోవచ్చు.

పాశ్చాత్య జ్యోతిష్యం (Western)

రెండు గ్రహాల మధ్య దూరం ఆధారంగా ఫలితాన్ని తెలియజేస్తారు. మానసిక పరిస్థితి ఎలా ఉంటుందని అంచనా వేస్తారు.

హస్త సాముద్రికం

చేతిలోని రేఖల ఆధారంగా ఫలితనిర్ణయం చేయడం. సూక్ష్మంగా ఫలితాన్ని నిర్ణయించే అవకాశం తక్కువగా ఉంటుంది.

ముగింపు

ఈ కోర్సులో నేర్పించేవి
పరాశర
KP పద్ధతి
పాశ్చాత్య
నక్షత్ర నాడి
వక్ర గ్రహాలు

ఒక మార్గం పూర్తిగా నేర్చుకొని మిగిలిన పద్ధతులతో పోల్చుకొని ఫలితాన్ని ఖచ్చితంగా పొందొచ్చు.

ఉదాహరణ: బెంగళూరు నుండి ముంబై పద్ధతుల పోలిక

ఒక వ్యక్తి బెంగళూరు నుంచి ముంబై వెళ్ళవలసి ఉంది:

  • సాంప్రదాయ జ్యోతిష్యం: ఆ వ్యక్తి ముంబై వెళ్ళగలుగుతారా లేదా అనేది చెప్తుంది.
  • పాశ్చాత్య జ్యోతిష్యం: సునాయాసంగా వెళతాడా లేదా ఇబ్బంది పడుతూ వెళ్తాడా అనేది చెప్తుంది.

ఈ రెండింటినీ కలిపి మనం ఆ వ్యక్తి వెళతాడా లేదా అని నిర్ణయించి, ప్రయాణం ఎలా సాగుతుందో కూడా తెలుసుకోవచ్చు.

అంతేకాకుండా నేను జ్యోతిష్యంలో చేసిన నా పరిశోధన మరియు జ్యోతిష్యుల అనుకూలత కొరకు ఉపయోగకరమైన ఆస్ట్రాలజీ టూల్స్ ఎలా తయారు చేశాను అనే విషయాన్ని కూడా పూర్తిగా పంచుకుంటాను.

"Ravi, astrology is like a vast ocean. If you want to learn to swim in it, you must first stand on the shore of fundamental principles..."

— This is the guidance a Guru gave when his student Ravi was overwhelmed looking at the books.

Introduction

We have discussed the benefits of astrology. Now I will explain what you need to learn in order to be able to predict astrological results.

What is Astrology?

Perceiving time — past, present, and future — is not possible for ordinary human beings. Only Rishis (sages), Munis (ascetics), and Maharshis (great sages) possess that ability.

We are fortunate beyond measure, because those Maharshis, through the power of their penance (Tapas), showed a path for even ordinary people to analyse the knowledge of time (Kaala) and karma through the positions of planets (Grahas).

When and How Can We Use Astrology?

Astrology describes a person's life through 12 houses (Bhavas). Results for every life situation can be predicted through astrology, but how we interpret them is very important.

For example, they say that if you pour water downward it flows to the lowest point. But in some situations it is hard to tell whether it will flow right or left. Astrology is similar — depending on context, one must interpret with greater depth.

Life Contexts

1 Health
2 Education
3 Family
4 Job / Business
5 Wealth
6 Stability & Property
7 Marriage
8 Children
9 Expenses & Problems
10 Divine Grace & Devotion

Regardless of the situation in life, we naturally receive results proportional to the effort we put in.

Good Fortune

Results 10 times greater than the effort put in.

Deserved Results

Receiving results proportional to the effort.

Misfortune

10x effort yields only a fraction of result, or no result at all.

Through astrology, we can understand which pattern our time follows in every situation of life.

Foundation of Astrology

In the world there are many routes to reach a destination. No matter which path or vehicle you take, you will arrive at your intended destination.

The foundation for all methods: Rashis, Nakshatras, Grahas, Graha Drishtis, and Dasha

Learning Paths in Astrology

There are many paths for predicting the future. To arrive at accurate predictions, one often needs to cross-verify using 2 or 3 different methods.

Astrology has been divided into three parts:

Siddhanta (Theory)

Planetary positions and related mathematical calculations.

Phalita (Predictive)

Revealing past, present, and future based on birth-time planetary positions.

Muhurta (Electional)

Knowing which period strengthens your intention a crore-fold.

Methods in Astrology

Parashari Astrology

The mother of all astrological systems. Contains methods to predict results based on planetary positions and determine timing through the Dasha system.

Jaimini Astrology

Sage Jaimini learned from Sage Parashara and developed his own style of determining astrological results.

Nadi Astrology

30 degrees further divided into 150, 300, or 600 parts for extremely minute-level analysis. (Bhrigu Nandi Nadi, Shiva Nadi, etc.)

Krishnamurti Paddhati (KP)

Primarily used for Prashna (horary) astrology — precise answers about a single important matter.

Western Astrology

Predicts based on angular distances between planets. Primarily assesses psychological and emotional states.

Palmistry (Hasta Samudrikam)

Predicting results based on hand lines. More limited scope for precise prediction compared to traditional astrology.

Conclusion

What This Course Covers
Parashari
KP System
Western
Nakshatra Nadi
Retrograde Planets

Learn one system well, then cross-verify with other methods to arrive at accurate results.

Example: Bangalore to Mumbai Comparing Methods

A person needs to travel from Bangalore to Mumbai:

  • Traditional (Parashari): Tells whether the person will reach Mumbai or not.
  • Western Astrology: Tells whether the person will travel with ease or face difficulties.

By combining both, we can determine whether the person will go and how the journey will unfold.

Additionally, I will fully share the research I have done in astrology and the useful Astrology Tools I have built for the convenience of astrologers.

On this page Introductionఉపోద్ఘాతం