LATEST Join RVA Research for a reading at no-cost. Learn more
Vignana Course

Contributions of Sages to Astrology

మహర్షుల కృషి, దైవకృప, గురు అనుగ్రహం మరియు జ్యోతిష్యుడి లక్షణాలు.

The contribution of great sages, divine grace, guru blessings, and qualities of an astrologer.

ఉపోద్ఘాతం

"జ్యోతిష్యం నేర్చుకోవడానికి అనేక మార్గాలు ఉన్నప్పటికీ, మెరుగైన ఫలితం చెప్పడానికి కొన్ని విషయాలు మనం తెలుసుకోవడం మంచిది..."

— దైవకృప, గురు అనుగ్రహం, కృతజ్ఞత భావం వంటి అంశాలు.

జ్యోతిష్యం నేర్చుకోవడానికి అనేక మార్గాలు ఉన్నప్పటికీ, మెరుగైన ఫలితం చెప్పడానికి కొన్ని విషయాలు మనం తెలుసుకోవడం మంచిది, ఈ వ్యాసం చదువక పోయిన మీరు జ్యోతిష్యం చెప్పగలుగుతారు, దైవకృప, గురు అనుగ్రహం, కృతజ్ఞత భావం ఇలాంటి కొన్ని విషయాలు చెప్పబోతున్నాను.

జ్యోతిష్యం

Necessity is mother of invention, మనిషికి ఏర్పడిన అనేక అవసరాలు, పెరిగిన జ్ఞానం, అందిన వేదం, పరిశీలన, పరిశోధన, తపోశక్తితో, కాలము మరియు ప్రకృతి ప్రస్తుతం ఉన్న పరిధి వలన మనకందే జ్యోతిష్యజ్ఞానం భవిష్యత్తును అంచనా వేయడానికి ఉపయోగపడుతుంది. జ్యోతిష్యం అనేది వేద విద్య, ప్రకృతి చాలా రహస్యమైనది మరియు నిగూడమైనది, ఏది ఎప్పుడు ఎవరికి ఎంత వరకు తెలియాలో అంతవరకే తెలియజేస్తుంది.

ఇది ఒక పదునైన కత్తిలాంటిది, ఇది మంచికి చెడుకి వాడే అవకాశం ఉంటుంది, అందుకే మహర్షులు, జ్ఞానవంతులకి మాత్రమే అర్థమయ్యేలాగా, ఒక పదానికి అనేక రకాలు అర్ధాలు వచ్చేలా మరియు సరైన వ్యక్తికి మాత్రమే సరైన అర్థం తెలిసేలాగా సంకల్పం చేత రాశారు.

కాబట్టి మనం ప్రకృతిని గౌరవిస్తూ, ధర్మాన్ని సున్నితంగా అర్థం చేసుకుంటూ, ప్రయత్నిస్తే ఆ రహస్యాలు మనకు తెలిసే అవకాశం ఉంటుంది.

జ్యోతిష్యుడు అవ్వడానికి ఉండే గ్రహస్థితి

రాసి చక్రంలో చివరి రాశి మీనం, ఇది దైవభక్తిని, మోక్ష మార్గాన్ని సూచిస్తుంది, రాశి చక్రంలో 4, 8, 12 రాసులు, జలరాసులు.

బుధుడు

గణితానికి, చదవడానికి, చదివింది అర్థం కావడానికి కారణం.

గురుగ్రహం

చదివిన దాని నుంచి వచ్చిన జ్ఞానాన్ని సూచిస్తుంది.

శని గ్రహం

వచ్చిన జ్ఞానం ప్రాక్టికల్ గా ఎలా వాడాలో తెలియజేస్తుంది. కర్మ కారకుడు, diplomacy కి కూడా కారకుడు. ఎవరికి ఏది ఎంతవరకు చెప్పాలో చెప్పే ప్రయత్నం చేయగలుగుతాడు, జ్యోతిష్యం చెప్పడానికి శని చాలా ముఖ్యమైన గ్రహం.

కేతు గ్రహం

మోక్ష కారక గ్రహం.

గురు బుద్ధులు సంబంధం బ్రాహ్మణ యోగాన్ని తెలియజేస్తుంది. కులం అనేది గుణాన్ని బట్టి ఏర్పడుతుంది కానీ పుట్టుకతో కాదు, శని బుధుల సంబంధం కర్మ కు సంబంధించిన గణిత జ్ఞానం తెలిసే అవకాశం ఉంటుంది.

గురువు, శని, కేతువు ఇవన్నీ స్పిరుచువల్ ప్రోగ్రెస్సింగ్ గ్రహాలు.

6, 8, 12 స్థానాలని త్రికములు అని అంటారు, 3 స్థానం, అష్టమత్, అష్టమం అవుతుంది. ఈ స్థానాలు ప్రమాదాలని సూచిస్తాయి.

జ్యోతిష్యుడికి ఈ గ్రహాలతో, ఈ భావాలతో సంబంధం ఉంటూ, ఆ యొక్క గ్రహాలు అనుకూలమైన స్థానంలో ఉంటాయి, దానివల్ల కర్మను అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది.

జ్యోతిష్యుడు ఒక గురువు కనుక, వాక్కు స్థానం (2, 3), జ్ఞానానికి సంబంధించి 5, 9 మంత్రస్థానాలు, ఉన్నతంగా ఉండే అవకాశం ఉంటుంది.

ఇవన్నీ ఇప్పుడే అర్థం కాకపోయినా, రాబోయే జాతక విశ్లేషణ సంబంధించిన వ్యాసాల ద్వారా మీకు ఇంకా బాగా అర్థమవుతుంది, అవి చదివాక మళ్ళీ వచ్చి తిరిగి చూడండి.

ప్రకృతి

మనం ఏదైతే వాతావరణంలో ఉన్నామో దానిలో ఉన్న ప్రతి అంశాన్ని ప్రకృతే, ప్రకృతి అంటేనే దైవం, దైవం అంటేనే ప్రకృతి.

పంచభూతాలు లేనిదే మనిషి జీవించలేడు, కర్మ ఫలితం తెలియందే, కాలం మీద పట్టు సాధించడం కష్టం.

కాలం అనేది లేకపోతే, మనందరం తోలుబొమ్మలతో సమానం. ప్రకృతి మనకి శరీరాన్ని ఇస్తే, కాలమనే దారంతోనే మన జీవిత ప్రయాణాన్ని సాగిస్తున్నాం. ప్రయాణం సుఖమయం కావడానికి ధర్మం అనే హెల్మెట్ కచ్చితంగా వాడాల్సిందే.

కాలం

సృష్టి చాలా పెద్దది, హిందూ పురాణాల ప్రకారం కాలాన్ని మన్వంతరాలు గాను, యుగాలుగాను కొలుస్తారు, దానితో పోలిస్తే మన జీవితం శూన్యం కన్నా కొంచెం ఎక్కువే అని ఎలా చెప్పాలో కూడా నాకు తెలియదు. 100% విధి లిఖితమైన కర్మతో ఎవరూ పుట్టరు. కొన్ని సందర్భాల్లో తప్పనిసరి పరిస్థితుల్లో (కర్మతో) జీవితం చిక్కుకుపోతుంది, మిగిలిందంతా మన చేతుల్లోనే ఉంది. ఒక్క విషయాన్ని మనం అర్థం చేసుకుంటే, ఎవరికి జ్యోతిష్యం చెప్తున్నామనే కన్నా, నువ్వు ఎందుకు పుట్టావు, ఏం చేయాలి, ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు మనకే సమాధానం దొరుకుతుంది. కనబడని కాలాన్ని వృధా చేస్తే జీవితం వ్యర్థమవుతుంది.

గ్రహాల ప్రభావం

వేడి గిన్నె పక్కన ఉంటేనే సెగ తగులుతుంది, సూర్యుడి ఎండ, చంద్రుడి చల్లదనం ఇవన్నీ చూస్తూనే పెరిగాము. కాబట్టి గ్రహాల యొక్క ప్రభావం జీవరాశి మీద ఉంటుంది.

గ్రహాలని మనం ఖగోళ పరంగానే చూస్తూ ఉంటాం.

కానీ వీటిని జ్యోతిష్యపరంగా మంత్ర స్వరూపంగా తీసుకుంటారు, వారిని దేవతలుగా తీసుకొని, ఏ కర్మకు ఎలాంటి ఫలితం తిరిగి వస్తుందనేది పరిగణలోకి తీసుకుంటారు. గ్రహాలు ప్రకృతిలో భాగమే, ప్రతి జీవి కర్మజీవి, పుట్టుకతోనే గ్రహ పీడితుడు అంటారు.

నిజానికి మనం చేసే మంచి చెడు పనుల యొక్క కర్మ ఫలితాన్ని, మనకి గుర్తున్నా లేకపోయినా, ప్రకృతి జాగ్రత్తగా గ్రహరూపంలో గుర్తుంచుకొని, తిరిగి మనం పుట్టినప్పుడు ఏర్పడిన గ్రహస్థితి ద్వారా ఈ జీవితంలో ఏం జరగాలని నిర్ణయించబడుతుంది.

దైవజ్ఞ లక్షణాలు, మంత్ర జపం

ఒక ఏడు లక్షణాలు కలిగి ఉంటే జీవితం సుఖంగా ఉంటుందని, మనకి తెలియజేశారు, అవేంటో మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. జ్యోతిష్యుడు గా ఈ లక్షణాలు కలిగి ఉండడం వల్ల, మన వల్ల సమాజానికి హితము మాత్రమే జరుగుతుంది.

అద్వేషి (Non-hateful)

ఎదుటి వాళ్ళని ద్వేషించకపోవడం వల్ల, మనం ఎటువంటి అసూయ లేకపోవడం వల్ల మానసికంగా ప్రశాంతంగా ఉంటాము. ద్వేషం లేకపోవడం వల్ల వచ్చినవాడు శత్రువు అయినప్పటికీ, మన జ్ఞానాన్ని ఎదుటివాడికి సరైన విధంగా పంచే ప్రయత్నం చేస్తాము.

మంచి ఉదాహరణ చెప్పాలంటే, మహాభారతంలో దుర్యోధనుడు, పాండవులకు శత్రువు అయినప్పటికీ, పాండవులలో చిన్నవారైన నకుల సహదేవులు జ్యోతిష్యులు, వాళ్లు ద్వేషం లేని వాళ్ళు అవ్వడం వల్ల, దుర్యోధనుడు యుద్ధం గెలవడానికి అభిజిత్ ముహూర్తం పెట్టడం జరిగింది, తర్వాత శ్రీకృష్ణుడు దుర్యోధనున్ని బ్రాంతికి గురి చేసి, ఆ ముహూర్తంలో యుద్ధం జరగకుండా చేశారు.

నిత్యసంతోషి (Ever-content)

సంతోషంగా ఉంటేనే ఎదుటివాడి కష్టాన్ని ప్రశాంతంగా విని సరైన సలహా ఇవ్వగలుగుతాం. ఇంకో విషయం ఏంటంటే ఏది ఉన్నా లేకపోయినా సంతోషం అలవాటయితే, ఎవరు ఏదిచ్చినా ఇవ్వకపోయినా ఒకే రకమైన సంతోషంతో మంచి జ్యోతిష్య ఫలితాలు ఇవ్వగలిగే అవకాశం ఉంది.

గణితజ్ఞ (Mathematician)

గ్రహగతులను, దశలను, వర్గచక్రాలను, చాలా విషయాలను లెక్కించుకొని చెప్పాల్సి ఉంటుంది, ప్రస్తుత కాలంలో అందరూ సాఫ్ట్వేర్లు వాడుతున్నారు, అయినా కూడా మనకి ఒక నోటి లెక్క ఉంటే, ఆ ఊహ శక్తితో చాలా అద్భుతంగా జ్యోతిష్య ఫలితం చేసే అవకాశం ఉంటుంది.

వాగ్మి (Eloquent)

జాతక ఫలితం తెలియడం ఒక ఎత్తు అయితే, దాన్ని ఎదుటి వాళ్ళకి అర్థమయ్యేలాగా, భయపెట్టకుండా చెప్పడం మరొ కళ, కాబట్టి మంచి మాటకరి అయితే మంచిది.

కుశాల బుద్ధి మాన్ (Sharp-minded)

ఒక విషయాని, సున్నితంగా, తెలివితేటలతో అర్థం చేసుకోవాల్సి ఉంటుంది, అప్పుడే వారి సందర్భానికి తగినట్టుగా మనము లెక్కించి చెప్పగలుగుతాం, మనము ధ్యానము, గురువుల అనుభవము వంటి వాటితో స్వతహాగా లేకపోయినా, మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేయవచ్చు.

సిద్ధ మంత్రం (Mantra Master)

సిద్దుడు లాగా మంత్ర సాధన జ్యోతిష్యుడికి అవసరం, ఏకాగ్రత, కుశాల బుద్ధిని ఇస్తుంది, ఇవి జ్యోతిష్య ఫలితాలలో మెరుగైన ధోరణి చూడొచ్చు.

ఊహ (Intuition)

ఈ మంత్రసాధన వల్ల జ్యోతిష్యులకు సరైన విషయాన్ని ఊహించే శక్తి కలిగి, beyond క్యాలిక్యులేషన్స్, prediction చేయగలుగుతారు. సరైన ఇంటుషన్ పవర్ రావడం ఒక అదృష్టం కూడా.

చెప్పించుకునేవారు సత్కర్మలు చేసుకొని, పూర్వపుణ్యం పొంది ఉంటే, జ్యోతిష్యుడు చీమైనా వాళ్ళు గొప్ప జ్యోతిష్య ఫలితాన్ని చెప్పించుకునే అవకాశం ఉంది.

బృహస్పతి & పార్వతి దేవి - రహస్య విద్య

బృహస్పతి & పార్వతి దేవి రహస్య విద్య

జ్యోతిష్యం ఫలించదని పార్వతి అమ్మవారి శాపం ఉంది.

కాలం అనేది అన్ని లోకాల్లో ఒకే విధంగా ఉండదు, దేవ గురువైన బృహస్పతి 100 సంవత్సరాలు తపస్సు చేసి జ్యోతిష్య జ్ఞానాన్ని పొందడం జరిగింది.

అయితే తన తపస్సు అనంతరం దేవా గురు అయిన బృహస్పతి ఆదిశక్తి పరాశక్తి అయిన పార్వతి దేవి అనుగ్రహం పొందడానికి కైలాసం వెళ్లడం జరిగింది.

అక్కడ ఉండే ద్వారపాలకులు వేచి ఉండమని చెప్పడం జరిగింది, అలా చాలాసేపు ఉండడం తర్వాత అమ్మవారి దర్శనం లభించింది.

పార్వతి దేవి సంతోష భరితులై బృహస్పతి తో సంభాషించడం జరిగింది, అయితే బృహస్పతి తను సంపాదించిన జ్యోతిష్య జ్ఞానాన్ని, ఆశీర్వదించమని కోరడం జరిగింది.

మీ జ్యోతిష్యం గొప్పదైనట్లయితే నువ్వు కైలాసం వచ్చిన దగ్గరనుంచి, నేను నిన్ను కలిసే వరకు ఏం జరిగిందో చెప్పగలవా అని ప్రశ్నించడం జరిగింది.

బృహస్పతి ఇలా మొదలు పెట్టడం జరిగింది, అమ్మ మీరు అభ్యంగన స్నానం ఆచరిస్తూండునుగా, అదే సమయంలో మహా శివుడు మీ దగ్గరకు రావడం జరిగింది, మీరు మీ చేతులతో శివుడి కళ్ళు మూయడం జరిగింది. ఇప్పుడు ఆ దేవుడు మూడో కన్నుతో చూడడానికి ప్రయత్నిస్తే, మీరు ఆ కన్ను పై ముద్దు పెట్టడం జరిగింది అని తెలియజేశారు.

ఈ జ్యోతిష్య ఫలితాన్ని విన్న ఆదిశక్తి ఆగ్రహంతో నీ జ్యోతి శాస్త్రం ఎందుకు పనికి రాకుండా పోతుందని శపించడం జరిగింది. ఇప్పుడు బృహస్పతి అనేక విధాలుగా ప్రాధేయపడగా ఎవరైతే నిబంధనలు ఉల్లంఘించకుండా జ్యోతిష్య ఫలితాన్ని చెప్తారో అప్పుడు మాత్రమే ఇది ఫలిస్తుంది అని సడలించడం జరిగింది.

స్త్రీల గురించి, ఏమి చెప్పాలో ఏమీ అడగాలో ఏమి అడగకూడదో, ఏ విషయాన్ని ఎంతవరకు చెప్పాలో కనీస ఇంగిత జ్ఞానం మనకి ఉండాలని ఈ కథ మనకు తెలియజేస్తుంది.

మహారాజు & రాజ్యంలోని ముసలి వాళ్లు

మహారాజు & ముసలివాళ్లు జ్ఞానం యొక్క విలువ

ఇది నేను ఎక్కడో విన్న కధే, ఒక రాజ్యంలో ఒక మహారాజు ఏదో ఒక సంఘటన కారణంగా రాజ్యంలోని ముసలి వాళ్ళందర్నీ చంపేయమని ఆదేశించాడు. వారి సైన్యం అంతా రాజు చెప్పినట్టు ముసలి వాళ్లు లేకుండా చేశారు.

కొన్ని రోజుల తర్వాత వరద మరియు కరువుల కారణంగా రాజ్యంలో తినడానికి తిండి కూడా లేకుండా ఏర్పడింది.

రాజు మరియు ఇతర సైన్యం ఈ సమస్య నుంచి బయటపడడానికి అనేక విధాలుగా ప్రయత్నించారు, ఆ రాజ్యం మొత్తం మీద ఒకే ఒక్క ముసలివాడు మిగిలి ఉన్నాడు, కొంతమంది వెళ్లి సమస్యను వెల్లడించారు.

ముసలివాడు ఒక సలహా ఇచ్చాడు, అదేంటంటే రాజ్యంలో పంట వేయడానికి విత్తనాలు కూడా లేవు కదా ఇప్పుడు, మీరేం చేయాలి అంటే, ఎప్పుడూ ధాన్యం తీసుకు వెళ్లే మార్గంలో ఇరువైపులా మట్టిని తవ్వి, ఆ మట్టిని సాగు చేయడానికి ప్రయత్నం చేయండి అని చెప్పడం జరిగింది. ఆ ముసలి తాత చెప్పినట్టుగానే ఆ మట్టిలో నుంచి మొలకలు వచ్చి మళ్లీ ధాన్యం పండించగలిగారు.

ఆ ముసలి వ్యక్తికి ఉన్న అనుభవం కారణంగానే రాజ్యం పెద్ద సమస్య నుంచి బయటపడింది. ఈ కథ నేను ఎందుకు చెప్తున్నాను అంటే మనం పుట్టడంతో దైవాంశ సంభూతులము కాదు, కేవలం మానవ మాత్రులం, కేవలం 80 సంవత్సరాలు కలిగిన ఆ ముసలివాడు ఇచ్చిన జ్ఞానంతో రాజ్యమే బాగుపడినప్పుడు, కొన్ని వేల సంవత్సరాల తపోశక్తితో సంపాదించిన జ్యోతిష్య జ్ఞానం, అనుభవం మనకెంతో ఉపయోగపడాలి.

అందుకే మనం ప్రతిరోజు మహర్షులను పూజించి, వారి అనుగ్రహం పొందాలి.

జ్యోతిష్యంలోని భాగాలు

జ్యోతిషాన్ని పరిస్థితులను బట్టి అనేక రకాలుగా విభజిస్తుంటారు, ప్రస్తుతానికి ఉన్న విభజన చెప్తాను.

ఫలిత జ్యోతిష్యం

గ్రహాల ఆధారంగా జీవితాన్ని అంచనా వేయడం.

సిద్ధాంతభాగం

గ్రహగమనాన్ని లెక్కించడం.

ముహూర్త భాగం

ఎలాంటి సమయంలో ఏమి చేస్తే బాగుంటుంది, అది ఏవిధంగా సంకల్ప బలాన్ని పెంచుతుంది.

ప్రశ్నా జ్యోతిష్యం

ఏదైనా ఒక విషయం గురించి మాత్రమే పూర్తిగా తెలియజేసేది.

సంహిత

ఒక పరిహారాన్ని గాని, క్రతువుని గాని, పూజలు గాని ఎలా ఆచరించాలని తెలియజేశారు.

ఈ విధంగా విభజించడం జరిగింది.

18 మంది జ్యోతిష్య మహర్షులు

సూర్యః పితామహో వ్యాసో వసిష్టోత్రి పరాశరః
కశ్యపో నారదో గర్గో మరీచి ర్మనురంగిరాః
రోమశః పౌలిశశ్చైవ చ్యవనో యవనో భృగుః
శౌనకోప్టాదశాశ్చైతే జ్యోతిశ్శాస్త్ర ప్రవర్తకా:

మనందరికీ పరాశర మహర్షిని మించి ఎవరు ఎక్కువగా తెలియదు, కానీ ఈ పైన శ్లోకం ఆధారంగా ఈ 18 మంది జ్యోతిష్య మహర్షులను పూజించి వారి అనుగ్రహం పొందుదాం.

వీరిలో కొందరు, సిద్ధాంత భాగం పైన, మరికొందరు ఫలిత భాగం పైన, ఇంకొందరు సంహితల పైన, ఇంకా ప్రశ్న జాతకం పైన ఇలా అనేక రకాలుగా మనకు జ్యోతిష్య జ్ఞానాన్ని అందించారు.

నేను నేర్చుకునే అప్పుడు కలిగిన అనుభవం

"నాలో ఉన్నా తర్కము, ప్రశ్నించే తత్వం కారణంగా జ్యోతిషంలో ఉన్న వాస్తవాన్ని తెలుసుకోవాలని మా నాన్నగారు జ్యోతిష్యుడు అవ్వడంతో, ఆయనను పరిపరి విధాల ప్రశ్నలతో విసిగిస్తూ ఉండేవాడిని."

— నా మొదటి గురువు, మా నాన్నగారు.

మా నాన్నగారు ఎప్పుడు నక్షత్ర జ్యోతిష్యం అనుసరిస్తూ ఉండేవారు, కేవలం గ్రహస్పటం ఆధారంగా అద్భుతమైన జ్యోతిష్య ఫలితాలను చెప్తూ ఉండేవారు.

ఆయనకి అరటిపండు వలచి నోట్లో పెట్టినట్టు చెప్పడం అనేది ఇష్టం ఉండదు, నేను బాగా కష్టపడిన తర్వాత దాని విలువ తెలిసిన తర్వాత మాత్రమే ఆ విషయాన్ని నాకు అర్థం చేయించేవారు. ఆయనే నాకు ప్రధమ గురువు.

అయితే 2014లో ఆరోగ్య సమస్యల వల్ల ఆయన పరమపదించారు, నేను ఒక్కసారిగా బావిలో కప్ప బయట పడినట్టుగా మారింది నా జీవితం, మరింత కచ్చిత ఫలితాన్ని చెప్పాలి అని అంటే ఇంకా ఇతర జ్యోతిష్య మార్గాలను నేర్చుకుంటే మంచిదని ప్రయత్నించాను.

మా నాన్నగారు పరమపదించాక పగలంతా ఏదో ఒక జాతక చక్రాన్ని పరిశీలిస్తూ ఆలోచిస్తూ ఉండేవాడిని, దాదాపు ఆరు నెలల వరకు ప్రతిరోజు రాత్రి మా నాన్నగారి కలలోకి వచ్చి నా సందేహాలు అన్ని నివృత్తి చేసేవారు.

దాదాపు శంకర్ దాదా ఎంబిబిఎస్ సినిమాలో అలాగనే, చిరంజీవి గారికి గాంధీజీ కనబడనట్టు, నాకు మా నాన్నగారు అర్ధరాత్రి క్లాసులు తీసుకున్నారు.

తర్వాత చాలాకాలం ఒక పేరు గుర్తు రావడానికి బాగా ఆలోచించాను, చివరిగా ఆయన పేరు గుర్తొచ్చి ఆయనను ఖమ్మంకు వెళ్లి పట్టుకొని మాట్లాడటం జరిగింది, ఆయన కృష్ణమూర్తి పద్ధతి నేర్చుకోమని సలహా చెప్పారు.

అప్పుడు, మరో మిత్రుడు, దాదాపు 70 సంవత్సరాల వయసు ఉంటుంది, ఆయన దాచుకున్న పుస్తకాలని నాకు ఇచ్చేశారు. తర్వాత నేను కేపీ కూడా నేర్చుకున్నాను, అదే క్రమంలో వెస్ట్రన్ ఆస్ట్రాలజీ నేర్చుకునే అవకాశం కూడా వచ్చింది.

జన్మ కాల సంస్కారం కోసం నేను చాలా ఇబ్బంది పడ్డాను, ఇంటర్నెట్ ఆధారంగా, దాదాపు 90 సంవత్సరాల వయసు ఉన్న మిస్సైడ్ సైంటిస్ట్ శ్రీ PVR రాయుడు గారిని కలిసి వారి అనుగ్రహంతో అది కూడా నేర్చుకున్నాను.

ఇలా నాకు అడుగడుగునా దైవం మనసు ఏదో ఓక రకంగా సహకరిస్తూనే ఉంది, దేవుడు నాయందు కృపతో అన్ని అవయవాలను అవకాశాలను సవ్యంగా ఇచ్చినప్పుడు, నా దగ్గర ఉన్న జ్ఞానాన్ని, ఈ ఆస్తిని అంటే ప్రయత్నం చేస్తున్నాను, అయితే 100% ఆలోచనలు ఉంటే దానిలో ఒక శాతం మాత్రమే ఇవ్వగలుగుతున్నాను అదే పెద్ద బాధ.

నిమిత్తం

నిమిత్తం - శకునం

ప్రకృతి ఎంత గొప్పదంటే మనం ఏదైతే జాతక ఫలితం చెప్తూ ఉంటామో, మనకి ఏదో ఒక శకున రూపంలో దాని ఫలితం మన కళ్ళముందే కనబడుతుంది.

ఉదాహరణకు జాతకుడు విదేశాల్లో ఉన్నాడు, ఇప్పుడు అక్కడే ఉంటాడా తిరిగి వస్తాడా అనేది ప్రశ్న, అదే సమయంలో మీ అమ్మ మాట్లాడడానికి మీ దగ్గరికి వచ్చిందనుకోండి, ఆ వ్యక్తి మదర్ లాండ్ కు వచ్చే అవకాశం ఆ జాతకంలో మీకు కనిపిస్తుంది.

వాక్సుద్ధి

ఏ వృత్తిలో లేని అదృష్టం జ్యోతిష్యంలో ఉంది — ఎప్పుడు ఎవరితోనో అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు.

సరైన జ్యోతిష్య ఫలితాలను మనకు తెలిసిన జ్ఞానంలో చెప్తూ ఉండడంవల్ల ఏదో ఒక నాటికి మీరన్నది జరిగే అవకాశం కూడా ఉంటుంది. ఇదే ప్రకృతి మనకిచ్చిన వాక్సుద్ధి.

ఎప్పుడైనా చెడుగా ఫలితం వచ్చినప్పుడు, రాబోయే ప్రమాదాలకు జాగ్రత్త తీసుకోమని చెప్పాలి గాని, ఇదే ప్రమాదం కచ్చితంగా ఈ విషయంలో మాత్రమే జరుగుతుందని మనం ఎన్నడూ కూడా చెప్పకూడదు.

ఎందువల్ల అంటే మీ మాటకు 0.001% బలమున్న అది వారికి చెడు మన మాట వల్ల కలగకూడదని నా ఉద్దేశం.

కానీ చాలామంది ఏ విషయంలో ముఖ్యంగా చెడు జరుగుతుందో తెలుసుకోవాలని అంటారు, ఈ విషయం దృష్టిలో పెట్టుకుని మాట్లాడండి.

ముగింపు

ముఖ్య సందేశం

వేద విద్య అయిన ఈ జ్యోతిష్యం, కేవలం సంకల్పం, ప్రయత్నంతో వచ్చేస్తుందని మనం పూర్తిస్థాయిలో చెప్పలేం, ఆ సమయానికి సరైన విషయం జ్యోతిష్యుడుగా జ్యోతిష్య ఫలితం చెప్పడానికి మనకి గురువుల అనుగ్రహం, దైవ బలం, ధ్యానం వంటివి తోడ్పడే అవకాశం ఉంది.

Introduction

"Although there are many paths to learning astrology, it is good to know certain things for better predictions..."

— Divine grace, guru blessings, and the feeling of gratitude.

Although there are many paths to learning astrology (Jyotishyam), it is good for us to know certain things in order to give better predictions. Even without reading this article, you will be able to practice astrology, but I am going to discuss a few important aspects such as divine grace (Daiva Krupa), the blessings of the Guru (Guru Anugraham), and the feeling of gratitude (Kritajnata Bhavam).

Astrology as Vedic Science

Necessity is the mother of invention. The many needs that arose for mankind, the growing knowledge, the received Vedas, observation, research, the power of penance (Tapas), and the scope of time (Kalam) and nature (Prakriti) as they currently exist -- all of these have given us astrological knowledge that helps us predict the future. Astrology is a Vedic science (Veda Vidya). Nature is deeply mysterious and enigmatic; it reveals only as much as needs to be known, to whom it needs to be known, and only at the right time.

It is like a sharp knife -- it can be used for both good and evil. That is why the great sages (Maharshis) wrote it with intent (Sankalpam), so that only the wise could understand it, so that a single word could carry multiple meanings, and so that only the right person would grasp the true meaning.

Therefore, if we respect nature, understand Dharma with sensitivity, and make sincere effort, there is a possibility of those secrets being revealed to us.

Planetary Requirements to Become an Astrologer

The last sign in the zodiac is Pisces (Meenam), which signifies devotion to God and the path of liberation (Moksha). In the zodiac, the 4th, 8th, and 12th signs are water signs (Jala Rashis).

Mercury (Budha)

The significator of mathematics, reading, and comprehension of what is read.

Jupiter (Guru Graham)

Signifies the wisdom that comes from what has been studied.

Saturn (Shani)

Reveals how to practically apply the knowledge gained. Saturn is the significator of karma and diplomacy -- it enables one to know what to say, to whom, and how much. Saturn is a very important planet for practicing astrology.

Ketu

The planet that signifies liberation (Moksha Karaka Graham).

The connection between Jupiter and Mercury indicates Brahmana Yoga. Caste (Kulam) is determined by one's qualities (Guna), not by birth. The connection between Saturn and Mercury gives the possibility of understanding the mathematical knowledge related to karma.

Jupiter, Saturn, and Ketu are all planets of spiritual progression.

The 6th, 8th, and 12th houses are called Trikams (Trikas). The 3rd house is the 8th from the 8th (Ashtamat Ashtamam). These positions indicate dangers and adversities.

For an astrologer, there will be a connection with these planets and these houses, and those planets will be placed in favorable positions, thereby giving the ability to understand karma.

Since an astrologer is a teacher (Guru), the houses of speech (2nd and 3rd), and the 5th and 9th houses related to knowledge -- the Mantra Sthanas (houses of sacred knowledge) -- will likely be elevated.

Even if all of this does not make sense right now, you will understand it much better through the upcoming articles on horoscope analysis (Jataka Vishleshanam). After reading those, come back and revisit this.

Nature (Prakriti)

Every element in the environment we live in is nature itself. Nature is God (Daivam), and God is nature.

A human cannot survive without the five elements (Pancha Bhutas). Without understanding the results of karma, it is difficult to gain mastery over time (Kalam).

Without time, we are all no different from puppets. If nature gives us the body, it is with the thread of time that we continue our life's journey. To make that journey comfortable, we must certainly use the helmet called Dharma.

Time (Kalam)

Creation is immensely vast. According to Hindu scriptures (Puranas), time is measured in Manvantaras and Yugas. Compared to that, I do not even know how to express that our life is barely more than nothing. No one is born with 100% predestined karma. In some circumstances, life gets entangled in unavoidable situations (due to karma), but the rest is in our own hands. If we understand just one thing -- rather than thinking about for whom we are practicing astrology -- we can find answers to questions like why were you born, what should you do, and many more. If we waste the invisible time, life becomes futile.

Influence of Planets

We feel the heat just by standing near a hot vessel. We have grown up experiencing the Sun's heat and the Moon's coolness. Therefore, the influence of planets on living beings is undeniable.

We usually look at planets only from an astronomical perspective.

But in astrology, they are regarded in their Mantra form (sacred essence). They are treated as deities (Devatas), and the karmic consequences of each action are taken into consideration. Planets are part of nature itself. Every living being is a being of karma. It is said that one is afflicted by planets from birth itself.

In reality, whether we remember or not, nature carefully records the karmic results of the good and bad deeds we perform in the form of planetary positions (Graha Roopam). When we are born again, it is determined through the planetary configuration at birth what should happen in this life.

Seven Qualities of an Astrologer

It has been taught to us that if one possesses seven qualities, life will be comfortable. Let us try to understand what they are. By possessing these qualities as an astrologer, only good will come to society through us.

Adveshi (Non-hateful)

By not hating others and being free from envy, we remain mentally peaceful. Because of the absence of hatred, even if the person who comes is an enemy, we will make the effort to share our knowledge with them in the right manner.

A good example is from the Mahabharata -- even though Duryodhana was the enemy of the Pandavas, the youngest among the Pandavas, Nakula and Sahadeva, were astrologers. Because they were free from hatred, they set the Abhijit Muhurta for Duryodhana to win the war. Later, Lord Sri Krishna confused Duryodhana and ensured that the war did not begin during that auspicious moment.

Nitya Santoshi (Ever-content)

Only when we are happy can we listen to another person's troubles peacefully and give proper advice. Another thing is that if happiness becomes a habit regardless of what we have or do not have, regardless of what anyone gives or does not give, there is the possibility of delivering good astrological predictions with consistent contentment.

Ganitajna (Mathematician)

An astrologer needs to calculate planetary transits (Graha Gatulu), planetary periods (Dashas), divisional charts (Varga Chakras), and many other things. In the current era, everyone uses software, but even so, if we have the ability to do mental calculations, there is the possibility of giving wonderfully accurate astrological predictions through that power of mental estimation.

Vagmi (Eloquent Speaker)

Knowing the horoscope result is one thing, but conveying it to others in an understandable way without causing fear is another art altogether. Therefore, being a good orator is beneficial.

Kushala Buddhi Man (Sharp-minded)

One needs to understand a matter with subtlety and intelligence. Only then can we calculate and convey predictions appropriate to their context. Even if we do not naturally possess this ability, we can cultivate it through meditation (Dhyanam) and the experience of teachers (Gurus).

Siddha Mantram (Mastery of Mantra)

Like a Siddha (perfected being), mantra practice (Mantra Sadhana) is essential for an astrologer. It grants concentration and sharp intellect, and one can see improved accuracy in astrological predictions as a result.

Ooha (Intuition)

Through this mantra practice, astrologers develop the power to intuit the correct answer, enabling predictions beyond calculations. Developing the right intuition power is also a matter of good fortune.

If the person seeking predictions has performed good deeds (Satkarmas) and accumulated merit from past lives (Poorva Punyam), then even if the astrologer is as small as an ant, those seekers will have the fortune of receiving excellent astrological predictions.

Brihaspati & Goddess Parvati -- The Secret Knowledge

Brihaspati & Goddess Parvati Rahasya Vidya

There is a curse from Goddess Parvati that astrology shall not bear fruit.

Time does not flow the same way across all worlds (Lokas). Brihaspati, the preceptor of the Devas, performed penance (Tapas) for 100 years and attained astrological knowledge.

After completing his penance, Brihaspati, the Guru of the Devas, went to Mount Kailasa to seek the blessings of Goddess Parvati, who is Adi Shakti (the Primordial Power) and Para Shakti (the Supreme Power).

The gatekeepers (Dwarapalakas) there asked him to wait. After waiting for a long time, he was finally granted the audience of the Goddess.

Goddess Parvati was pleased and conversed with Brihaspati. Brihaspati then requested her to bless the astrological knowledge he had acquired.

She questioned him: "If your astrology is so great, can you tell me what happened from the time you arrived at Kailasa until the time I came to meet you?"

Brihaspati began: "O Mother, you were performing an oil bath (Abhyangana Snanam). At that very moment, Lord Maha Shiva came to you. You covered Shiva's eyes with your hands. When that Lord tried to see with his third eye, you kissed that eye" -- this is what he revealed.

Upon hearing this astrological revelation, Adi Shakti cursed in anger that his Jyotish Shastra (science of astrology) would become useless. When Brihaspati pleaded in many ways, she relented and modified the curse: astrology would bear fruit only when the astrologer follows the rules and ethical boundaries while giving predictions.

This story teaches us that when it comes to women, we must have at least basic common sense about what to say, what to ask, what not to ask, and how far to reveal any matter.

The King & the Elders of the Kingdom

The King & the Elders The Value of Wisdom

This is a story I heard somewhere. In a certain kingdom, a king ordered all the old people in his kingdom to be killed due to some incident. His army carried out the king's command and eliminated all the elderly people.

A few days later, due to floods and famines, the kingdom was left without any food to eat.

The king and his army tried in many ways to escape this crisis. In the entire kingdom, only one old man had survived. Some people went to him and revealed the problem.

The old man gave a piece of advice: since there were no seeds left in the kingdom for sowing, he told them to dig up the soil on both sides of the path where grain had always been transported, and to try cultivating that soil. Just as the old grandfather suggested, sprouts emerged from that soil, and they were able to grow grain once again.

It was because of the experience that old man possessed that the kingdom was saved from a great crisis. The reason I am telling this story is that we are not born as divine beings -- we are merely human. If an old man with only 80 years of experience could save an entire kingdom with his knowledge, then the astrological wisdom acquired through thousands of years of penance (Tapas) and experience should be of immense benefit to us.

That is why we must worship the great sages (Maharshis) every day and seek their blessings (Anugraham).

Branches of Astrology

Astrology is divided into various branches depending on the circumstances. I will describe the current classification.

Phalita Jyotishyam

Predicting life events based on planetary positions.

Siddhanta Bhagam

Calculating the movements of planets.

Muhurta Bhagam

Determining what actions performed at what times yield the best results, and how it strengthens the power of intention (Sankalpa Balam).

Prashna Jyotishyam

Providing complete answers about a specific question or matter.

Samhita

Teaches how to perform remedies (Pariharas), rituals (Kratuvu), and worship (Pujas).

This is how astrology has been divided.

The 18 Sages of Astrology

Suryah Pitamaho Vyaso Vasishto-tri Parasharah
Kashyapo Narado Gargo Marichi-r-Manu-r-Angirah
Romashah Paulishashchaiva Chyavano Yavano Bhriguh
Shaunako-ptadashaashchaite Jyotish-shastra Pravartakah

Most of us may not know many sages beyond Sage Parashara, but based on the above shloka (verse), let us worship all 18 sages of astrology and seek their blessings.

Among them, some specialized in the theoretical division (Siddhanta Bhagam), some in predictive astrology (Phalita Bhagam), others in compendiums (Samhitas), and still others in horary astrology (Prashna Jatakam) -- in this way, they provided us with astrological knowledge in many different forms.

My Experience While Learning

"Due to the analytical thinking and questioning nature within me, I wanted to discover the truth in astrology. Since my father was an astrologer, I used to pester him relentlessly with all kinds of questions."

— My first Guru, my father.

My father always followed Nakshatra-based astrology (Nakshatraa Jyotishyam) and used to give wonderful astrological predictions based solely on planetary longitudes (Graha Spatam).

He did not like to spoon-feed knowledge. He would explain a concept to me only after I had struggled hard enough and understood its value on my own. He was my first Guru (teacher).

However, in 2014, he passed away due to health problems. My life suddenly changed, like a frog from a well being thrust into the outside world. I felt the need to give more accurate predictions, so I decided it would be good to learn other systems of astrology as well.

After my father passed away, I would spend all day studying and contemplating horoscope charts (Jataka Chakram). For about six months, my father would come to me in my dreams every night and resolve all my doubts.

Much like in the movie "Shankar Dada MBBS" where Gandhiji appears to Chiranjeevi, my father used to conduct midnight classes for me.

Later, I thought long and hard to recall a certain person's name. When I finally remembered, I went to Khammam to meet him and speak with him. He advised me to learn the Krishnamurti Paddhati (KP System).

Then, another friend, approximately 70 years old, gave me all the books he had carefully preserved. After that, I learned KP astrology as well, and in the same course, I also got the opportunity to learn Western Astrology.

I struggled a great deal for birth time rectification (Janma Kala Samskaram). Through the internet, I met Sri PVR Rayudu, a retired missile scientist who was approximately 90 years old, and with his blessings, I learned that as well.

In this way, at every step, the divine has been cooperating with me in one way or another. When God has graciously given me all faculties and opportunities in good order, I am trying to share the knowledge I possess -- this wealth -- with others. However, if I have 100% of ideas, I am only able to share about one percent of them, and that is my greatest regret.

Omens (Nimittam)

Nimittam - Omens in Practice

Nature is so magnificent that whatever horoscope prediction we are making, its result appears before our very eyes in the form of some omen (Shakunam).

For example, suppose the native (Jatakudu) is living abroad, and the question is whether he will stay there or return. At that very moment, if your mother comes to speak with you, you will see in the horoscope the possibility of that person returning to the motherland.

Purity of Speech (Vak Shuddhi)

There is a blessing in astrology that no other profession has -- you never need to lie to anyone.

By consistently giving astrological predictions to the best of our knowledge, there is a possibility that what you say will eventually come true. This is the Vak Shuddhi (purity of speech) that nature has blessed us with.

Whenever a negative result appears, we should advise the person to take precautions against upcoming dangers, but we should never say that this exact danger will definitely happen in this specific matter.

The reason is that even if your words carry just 0.001% of power, my intention is that no harm should come to them because of our words.

However, many people want to know specifically in which area the negative outcome will occur. Keep this in mind when you speak.

Conclusion

Key Message

We cannot say with complete certainty that this Vedic science of astrology comes solely through willpower (Sankalpam) and effort (Prayatnam). For delivering the right prediction at the right time as an astrologer, the blessings of Gurus (Guruvula Anugraham), divine strength (Daiva Balam), and meditation (Dhyanam) are likely to be of great assistance.

On this page Introductionఉపోద్ఘాతం