LATEST Join RVA Research for a reading at no-cost. Learn more
Vignana Course

Karakatwas of Signs (Significations of Zodiac Signs)

రాశుల కారకత్వాలు — జ్యోతిష్యంలో రాశుల విభజన & ఫలిత నిర్ణయం

Understanding Zodiac Sign Classifications and Their Significations in Predictive Astrology

ఉపోద్ఘాతం

రాశులు ఊహాజనితమైనవి అని అందరికీ తెలిసిందే, అలా అని మన సరదాకి ఊహించుకోకూడదు.

గోదారి గట్టుంది, గట్టుమీద చెట్టు ఉంది, చెట్టుమీద పిట్ట ఉంది, పిట్ట మనసులో ఏముంది…

ఇలా అన్నీ కలిసిన దృశ్యాన్ని చూడ్డానికి చాలా బాగుంది. అలాగే ఒక గ్రహం ఒక రాశిలో ఉంది, నక్షత్రంలో ఉంది, స్థానంలో ఉంది — ఈ పరిణామాన్ని గుర్తించడం వస్తే జ్యోతిష్య ఫలితం చెప్పడం సునాయాసం.

గొప్పరాజ్యం అనే కథ ఆధారంగా రాశి, గ్రహ కారకత్వాల మీద ఒక అవగాహన వచ్చుంటుంది. ఇప్పుడు దాన్ని ఫలిత జ్యోతిషంలో ఎలా వాడాలనేదే ఈ వ్యాసం యొక్క ముఖ్య ఉద్దేశం.

లగ్నమే ఆధారం

ఆకాశంలో అందంగా ఎగిరే గాలిపటానికి దారమే ఆధారమైతే, లగ్నం లేనిదే ఫలిత నిర్ణయం చేయడం అసాధ్యం.

మనం నేర్చుకునేటప్పుడే లగ్నం ఆధారంగా అర్థం చేసుకుంటే ఫలిత జ్యోతిష్యంలో ఉపయోగపడుతుంది.

పలిత జ్యోతిష్యంలో రాశుల ప్రాముఖ్యత

గ్రహాలు రాశి అనే ఒక భూమి మీద, నక్షత్రం అనే ఒక రోడ్డుపై వాహనం లాగా సంచరిస్తాయి. భూమి ఎంత సారవంతమైనది, రోడ్డు ఎంత బలమైనది — ఇది గ్రహానికి చాలా ముఖ్యం.

రాశుల విభజన

ప్రపంచంలోని అన్ని సందర్భాలకు జ్యోతిష ఫలితాన్ని చెప్పడానికి రాశులను అనేక రకాలుగా విభజించారు.

01సరి, భేసి రాశులు
02పగటి రాశులు, రాత్రి రాశులు
03చర, స్థిర, ద్విస్వభవ రాశులు
04భూత, వర్తమాన, భవిష్యరాశులు
05పొట్టి, మధ్యమ, పొడుగు రాశులు
06సాత్విక, రజో, తామసిక రాశులు
07మనిష్య, పశు, జల, కిటక రాశులు
08అగ్ని, భూమి, వాయు, జలరాశులు
09పూర్ణ, అర్ధ, పాద, నిర్జల రాశులు
10గుడ్డి, చెవిటి, మూగ, కుంటి రాశులు
11రాశులు - కాలపురుషాంగాలు

సరి రాశులు, బేసి రాశులు

మేషం నుండి లెక్కిస్తే సరి సంఖ్య కలిగినవే సరిరాశులు, బేసి సంఖ్య వస్తే బేసి రాశులవుతాయి.

బేసి (Odd) పురుష రాశులు — క్రూర రాశులు
మేషంమిధునంసింహం తులధనస్సుకుంభం

1, 3, 5, 7, 9, 11

సరి (Even) స్త్రీ రాశులు — సౌమ్య రాశులు
వృషభంకర్కాటకంకన్య వృశ్చికంమకరంమీనం

2, 4, 6, 8, 10, 12

ఉదాహరణ

పంచమరాశి పురుషరాశి అయ్యి, పంచమాధిపతి పురుష భాగంలో ఉంటే పురుష సంతానం కలగవచ్చు. వృషభంలో మొదటి 15 డిగ్రీలు పురుష భాగం, మిగిలిన 15 డిగ్రీలు స్త్రీ భాగం.

చర, స్థిర, ద్విస్వభావ రాశులు

చర రాశులు (Movable) — బాధక స్థానం: 11వ స్థానం

మేషం, కర్కాటకం, తుల, మకరం — మార్పు మరియు అనుకూలతను సూచిస్తాయి. చర అంటే కదిలేది. ఈ రాశుల ప్రభావం లగ్నమైతే ఆరు నెలల నుంచి ఒక ప్రదేశంలో ఉద్యోగం చేయలేరు.

స్థిర రాశులు (Fixed) — బాధక స్థానం: 9వ స్థానం

వృషభం, సింహం, వృశ్చికం, కుంభం — స్థిరత్వం మరియు అనుగుణ్యతను సూచిస్తాయి. నిర్ణయాత్మకంగా మరియు విశ్వసనీయంగా ఉంటారు.

ద్విస్వభావ రాశులు (Dual) — బాధక స్థానం: 7వ స్థానం

మిధునం, కన్య, ధనుస్సు, మీనం — వశ్యత మరియు అనుకూలతను సూచిస్తాయి. అవసరం వస్తే మారొచ్చు, లేకపోతే అక్కడే ఉండొచ్చు.

బలం

రాశుల బలం క్రమం Strength Order

చరరాశులు అన్నింటికన్నా బలమైనవి → స్థిరరాశులు మధ్యస్థం → ద్విస్వభావ రాశులు చివరగా. అంటే ఒక గ్రహం చరరాశిలో ఉంటే ఇంకా బలంగా ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది.

భూత, వర్తమాన, భవిష్యరాశులు

ఇది ప్రశ్న జ్యోతిష్యంలో ఎక్కువగా వాడుతున్నారు. ప్రశ్న కాల లగ్నం ఏ కాలాన్ని సూచిస్తుందో అనుసరించి ఫలితం చెప్తారు.

భూత
మేషం, కర్కాటకం, తుల, మకరం
వర్తమాన
వృషభం, సింహం, వృశ్చికం, కుంభం
భవిష్య
మిధునం, కన్య, ధనస్సు, మీనం

పొట్టి, మధ్యమ, పొడుగు రాశులు

ఒక వ్యక్తి ఎంత ఎత్తు ఉన్నాడో అంచనా వేయడానికి లగ్నం, చంద్రుడు, లగ్న నక్షత్రాధిపతి స్థితి పరిశీలిస్తారు.

పొట్టి
మీనం, కుంభం, మేషం, వృషభం
మధ్యమ
ధనస్సు, మకరం, మిధునం, కర్కాటకం
పొడుగు
సింహం, కన్య, తుల, వృశ్చికం

సాత్విక, రజో, తామసిక రాశులు

గ్రహాలు, రాశులను త్రిగుణాలైన సాత్విక, రాజసిక, తామసిక వర్ణాలుగా విభజించారు. ఇది మంచి చెడు కాదు — సమయ సందర్భాలను బట్టి వాడుకోవలసి ఉంటుంది.

సాత్విక — గురు, బుధులు

ఏ విషయాన్ని ఆశించకుండా సహాయం చేయగలిగే గుణం. ధనస్సు, మీనం (గురు), మిధునం, కన్య (బుధ) రాశులు.

రాజసిక — రవి, చంద్ర, శుక్రులు

ప్రతిఫల ఆపేక్షతో నడుచుకునే గుణం. సింహం (రవి), కర్కాటకం (చంద్ర), తుల, వృషభం (శుక్ర) రాశులు.

తామసిక — శని, కుజ, రాహు, కేతు

కొన్ని సందర్భాలలో ఎవరు చేయలేని పనిని చేయగలిగే గుణం. మకరం, కుంభం (శని), మేషం, వృశ్చికం (కుజ) రాశులు.

అగ్ని, భూమి, వాయు, జలరాశులు (పంచభూతాలు)

రాశులను నాలుగు తత్వాలుగా విభజించారు. గ్రహాలు కూడా ఈ విధంగా నాలుగు రకాలుగా ఉంటాయి — రవి, కుజులు అగ్నితత్వ గ్రహాలు, అవి అగ్నితత్వరాసుల్లో బాగా బలంగా ఉంటాయి.

🔥

అగ్ని తత్వం

మేషం · సింహం · ధనస్సు

గ్రహాలు: రవి, కుజ

చురుకుగా ఉంటారు, కొంత కోపదారు మనిషి

🌍

భూ తత్వం

వృషభం · కన్య · మకరం

గ్రహాలు: బుధ

వాస్తవానికి దగ్గరగా ఉండే ఆలోచనలు

💨

వాయు తత్వం

మిధునం · తుల · కుంభం

గ్రహాలు: శని, రాహు

అన్నింటిని సత్వరమే సాధించాలనే వేగం

🌊

జల తత్వం

కర్కాటకం · వృశ్చికం · మీనం

గ్రహాలు: చంద్ర, శుక్ర, కేతు

సున్నితమైన మనస్తత్వం

పూర్ణ, అర్ధ, పాద, నిర్జల రాశులు

ఇది ఎక్కువగా సంతాన విషయంలో ఫలితం చెప్పడానికి వాడుతుంటారు. పంచమాధిపతి పూర్ణ జలరాసుల్లో ఉంటే సంతాన దోషం లేనట్లయితే సునాయాసంగా సంతానం కలుగుతుంది.

100%
కర్కాటకం, మీనం, మకరం
50%
వృషభం, ధనస్సు, కుంభం
25%
మేషం, తుల, వృశ్చికం
0%
కన్య, మిధునం, సింహం

మనిష్య, పశు, జల, కిటక రాశులు

ఆరవ స్థానం చిన్న జంతువులను, పదకొండవ స్థానం పెద్ద జంతువులను సూచిస్తుంది. ఒక వ్యక్తికి ఏ జంతువు వల్ల ఇబ్బంది కలగవచ్చో, ఏ జంతువు వల్ల లాభమో చెప్పడానికి ఉపయోగపడుతుంది.

మనుష్య రాశులు

మిధునం, కన్య, తుల, కుంభం, ధనస్సులో మొదటి భాగం

పశు రాశులు

మేషం, వృషభం, సింహం, ధనస్సులో రెండవ భాగం, మకరంలో మొదటి భాగం

జలచర రాశులు

కర్కాటకం, మకరంలో రెండవ భాగం, మీనం

కీటక రాశి

వృశ్చికం

గుడ్డి, చెవిటి, మూగ, కుంటి రాశులు

ఒక చిన్న పిల్లవాడు ఇంకా మాటలు రావట్లేదు అని అంటే — ద్వితీయం వాక్కు స్థానం, బుధుడు, గురుడు వంటి గ్రహాలు ఎలా ఉన్నాయో చూడాలి. అన్నీ కూడా మూగ రాశుల్లో పడి దోషం ఏర్పడిన అప్పుడు ఆ సమస్య అయ్యే అవకాశం ఉంది.

గుడ్డి

మేషం, సింహం, ధనస్సు

చెవిటి

వృషభం, కన్య, మకరం

మూగ

మిధునం, తుల, కుంభం

కుంటి

కర్కాటకం, వృశ్చికం, మీనం

పగటి, రాత్రి రాశులు

ఒక వ్యక్తి పగలు పుట్టాడా, రాత్రి పుట్టాడా అనే ఆధారంగా పరిశీలించి పగలు బలంగా ఉండే గ్రహాలు ఆ వ్యక్తికి ఎక్కువ ఫలితం ఇస్తాయి. ముహూర్తంలో కూడా ఉపయోగపడుతుంది.

☀️ పగటి పూట బలం
మేషంవృషభంమిధునం కర్కాటకంధనస్సుమకరం
🌙 రాత్రి బలం
సింహంకన్యతుల వృశ్చికంకుంభంమీనం

రాశులు - కాలపురుషాంగాలు

ఒక వ్యక్తి చేతులకు సంబంధించిన ఆటలు ఆడాలనుకుంటున్నాడు అంటే ఆ అవయవం ఎంత బలంగా ఉందో తెలుసుకోవడానికి ఈ విభజన ఉపయోగపడుతుంది. ఏ రాశిలో గ్రహదోషం ఏర్పడితే ఆ అవయవంలో ఇబ్బందులు ఉంటాయి.

మేషంశిరస్సు, నుదురు, మెదడు
వృషభంముఖము, కంఠము, నేత్రాలు
మిధునంభుజములు
కర్కాటకంచాతి, హృదయం, శ్వాస
సింహంఉదర కుహ్యం
కన్యనాభి
తులపొత్తికడుపు
వృశ్చికంమర్మావయవాలు
ధనస్సుతొడలు
మకరంమోకాళ్ళు
కుంభంమడిమ, పిక్కలు, చీలమండలం
మీనంపాదాలు

రాశుల కారకత్వాలు

గాయకుల ఇంట్లోకి వెళితే సంగీత వాయిద్యాలు, పుస్తకాలు చూడడం ఎంత సహజమో, ఒక రాశి దాని అధిపతి ఆధారంగా అది ఎలా ఉంటుందో ఊహించే ప్రయత్నం చేయాలి.

ఒక రాశి కారకత్వం ఆ రాశ్యాధిపతి వల్లే కాకుండా, ఆ రాశిలో ఉండే నక్షత్రాల వల్ల కూడా కలుగుతుంది.

మేషం

డైనమిక్, ఔత్సాహిక, తల, అడవులు, పెద్ద నుదురు, తొందరపాటు, నాయకత్వం, పొడి, పొడవు

వృషభం

అందమైన ముఖం, స్థిరమైన, విలాసవంతమైన, నమ్మకమైన, చక్కటి దంతాలు, పెద్ద కళ్ళు, బలిష్టమైన

మిధునం

కమ్యూనికేషన్, జర్నలిజం, పాఠశాలలు, తంతులు, వార్తాపత్రికలు, నేర్చుకున్న, ఉల్లాసమైన

కర్కాటకం

గుండె, నీటి పొలాలు, వంటగది, ఆహారం, ఆకర్షణీయమైన, తల్లి వంటి, సున్నితమైన

సింహం

పర్వతాలు, అడవులు, రాజభవనాలు, కోటలు, రాచరికంగా, ఆత్మగౌరవంగా, ఆధిపత్యంగా

కన్య

గ్రంథాలయాలు, పొలాలు, తెలివైన, పదునైన వక్త, నాడీ, విచక్షణ, యుక్తి

తుల

వ్యాపారవేత్త, మార్కెట్లు, బ్యాంకులు, హోటళ్లు, సమతుల్యత, మంచి మాట్లాడేవాడు

వృశ్చికం

లోతైన గుహలు, గనులు, రహస్య, క్షుద్ర, బెస్ట్ ఫ్రెండ్ లేదా చెత్త శత్రువు, సున్నితమైన

ధనస్సు

తొడలు, న్యాయవాదులు, ప్రభుత్వ కార్యాలయాలు, నిజాయితీ, కండరాలు, లోతైన కళ్ళు

మకరం

మోకాళ్లు, నీటి ప్రదేశాలు, జంతువులు, పొడవాటి మెడ, జాగ్రత్తగా, రహస్యంగా ఉండేవాడు

కుంభం

దాతృత్వం, తత్వశాస్త్రం, పొడవైన, పర్వత వసంత ప్రదేశాలు, కష్టపడి పనిచేయడం, నిజాయితీ

మీనం

పాదాలు, మహాసముద్రాలు, జైళ్లు, ఆసుపత్రులు, పొట్టి, పెద్ద కళ్ళు, భావోద్వేగం, నిజాయితీ

జాతక విశ్లేషణ ప్రయోగంలో రాశులు

ఒక దానిమీద మరొక విషయాన్ని ఉంచి ఎలా అందంగా విశ్లేషించాలనేది మనకి పూర్తి లాజికల్ గా తెలిస్తే, ఫలిత జ్యోతిష్యం అంత కష్టమైన పనేమీ కాదు.

1లగ్నం
2లగ్నం + రాశి
3లగ్నం + రాశి + భావం
4లగ్నం + రాశి + భావం + గ్రహం
5లగ్నం + రాశి + భావం + గ్రహం + నక్షత్రం
6లగ్నం + రాశి + భావం + గ్రహం + నక్షత్రం + నక్షత్రాధిపతి స్థానం
Ex

కర్కాటక లగ్నం ఉదాహరణ Analysis

కర్కాటక లగ్నాధిపతి చంద్రుడు పదవయింట మేషరాశిలో, కృత్తిక నక్షత్రంలో ఉన్నారనుకోండి. మేషం చంద్రుడి మనస్తత్వానికి పూర్తి అనుకూలమైనది కాదు, కానీ చంద్ర కుజులు మిత్రులు. కృత్తిక — దనాధిపతి నక్షత్రం, పుష్కర నవాంశ కూడా. చంద్రుడు రవి నక్షత్రంలో ఉండడం, రవి ఉచ్చలో ఉంటే విశేష ఫలితాలు. దశమ స్థానం వల్ల కీర్తి, పేరు ప్రతిష్టలు కలుగుతాయి.

ముగింపు

సారాంశం

లగ్నం నుండి ప్రతి రాశినే లెక్కించి భావంగా పరిగణిస్తాం. గ్రహాలు లగ్నం ఆధారంగా ఏ రాశిలో ఉన్నాయి, ఆ రాశిలో ఉచ్చ లేక నీచ పడ్డాయా, ఆ రాశి అధిపతి ఎక్కడ ఉన్నాడు, నక్షత్రాధిపతి ఎక్కడ ఉన్నాడు — ఇలా అన్నీ పరిశీలించి భావ విశ్లేషణ చేయవలసి ఉంటుంది.

రజనీకాంత్ గారి డైలాగ్ — "ఒక వ్యక్తి జీవితంలో దక్కేది ఎన్నటికైనా దక్కుతుంది, దక్కనిది ఎన్నటికీ దక్కదు." దీన్ని జ్యోతిష్యపరంగా పరిశీలించాలంటే గ్రహబలాన్ని అంచనా వేసి భావాన్ని నిర్ణయించాల్సి ఉంటుంది.

Introduction

Everyone knows that Rasis (zodiac signs) are imaginary constructs, but that does not mean we can imagine them however we please.

"There is a bank along the Godavari river, on the bank there is a tree, on the tree there is a bird, what is in the bird's heart?"

Just as this combined scene has beauty in its wholeness, a planet in a sign, in a nakshatra, in a house from the Lagna — recognizing the outcome of all these circumstances together makes predictive astrology easy.

Lagna is the Foundation

Just as the string is the foundation for a kite flying beautifully in the sky, it is impossible to make predictions without the Lagna (ascendant).

Importance of Signs in Predictive Astrology

Planets travel like vehicles on the road called a Nakshatra, on the land called a Rasi. How fertile the land is and how strong the road is — these are very important for a planet. For now, let us understand these Rasis (the "land").

Classification of Signs

Since astrological predictions must be given for all situations in the world, signs are classified in numerous ways to serve our needs.

01Even and Odd Signs
02Diurnal (Day) and Nocturnal (Night) Signs
03Movable (Chara), Fixed (Sthira), and Dual (Dwiswabhava) Signs
04Past, Present, and Future Signs
05Short, Medium, and Tall Signs
06Sattvic, Rajasic, and Tamasic Signs
07Human, Animal, Aquatic, and Insect Signs
08Fire, Earth, Air, and Water Signs
09Full-water, Half-water, Quarter-water, and Waterless Signs
10Blind, Deaf, Mute, and Lame Signs
11Signs and Body Parts of the Kalapurusha

Odd & Even Signs

Among the 12 signs counted from Aries, those with odd numbers are masculine (Purusha) signs — naturally cruel signs. Those with even numbers are feminine (Stri) signs — gentle signs.

Odd Signs Masculine (Purusha) — Cruel Signs
AriesGeminiLeo LibraSagittariusAquarius

1, 3, 5, 7, 9, 11

Even Signs Feminine (Stri) — Gentle Signs
TaurusCancerVirgo ScorpioCapricornPisces

2, 4, 6, 8, 10, 12

Movable, Fixed & Dual Signs

Movable Signs (Chara) — Badhaka: 11th house

Aries, Cancer, Libra, Capricorn — Indicate change and adaptability. If the Lagna or Dasha lord is in a Chara sign, the person may frequently change locations or jobs.

Fixed Signs (Sthira) — Badhaka: 9th house

Taurus, Leo, Scorpio, Aquarius — Indicate stability and consistency. People born under these signs are decisive and reliable.

Dual Signs (Dwiswabhava) — Badhaka: 7th house

Gemini, Virgo, Sagittarius, Pisces — Indicate flexibility. May or may not change depending on need and circumstances.

Strength

Sign Strength Order Bala

Chara signs are strongest → Sthira signs are intermediate → Dwiswabhava signs are weakest. A planet in a Chara sign has the highest potential to deliver its results strongly.

Past, Present & Future Signs

Primarily used in Prashna (horary) astrology. The sign of the question-time Lagna indicates the timing of results.

Past
Aries, Cancer, Libra, Capricorn
Present
Taurus, Leo, Scorpio, Aquarius
Future
Gemini, Virgo, Sagittarius, Pisces

Short, Medium & Tall Signs

Short
Pisces, Aquarius, Aries, Taurus
Medium
Sagittarius, Capricorn, Gemini, Cancer
Tall
Leo, Virgo, Libra, Scorpio

Sattvic, Rajasic & Tamasic Signs

S

Sattvic — Jupiter, Mercury

Ability to help without expecting anything in return. Sagittarius, Pisces (Jupiter), Gemini, Virgo (Mercury) signs.

R

Rajasic — Sun, Moon, Venus

Acting with expectation of reward. Leo (Sun), Cancer (Moon), Libra, Taurus (Venus) signs.

T

Tamasic — Saturn, Mars, Rahu, Ketu

Capable of doing what others cannot. Capricorn, Aquarius (Saturn), Aries, Scorpio (Mars) signs.

Fire, Earth, Air & Water Signs

🔥

Fire Signs

Aries · Leo · Sagittarius

Planets: Sun, Mars

Active, energetic, sometimes quick-tempered

🌍

Earth Signs

Taurus · Virgo · Capricorn

Planets: Mercury

Practical, grounded thinking

💨

Air Signs

Gemini · Libra · Aquarius

Planets: Saturn, Rahu

Desire for swift achievement, communicative

🌊

Water Signs

Cancer · Scorpio · Pisces

Planets: Moon, Venus, Ketu

Sensitive, emotional nature

Water Content Signs

100%
Cancer, Pisces, Capricorn
50%
Taurus, Sagittarius, Aquarius
25%
Aries, Libra, Scorpio
0%
Virgo, Gemini, Leo

Human, Animal, Aquatic & Insect Signs

Human Signs

Gemini, Virgo, Libra, Aquarius, first half of Sagittarius

Animal Signs

Aries, Taurus, Leo, second half of Sagittarius, first half of Capricorn

Aquatic Signs

Cancer, second half of Capricorn, Pisces

Insect Sign

Scorpio

Blind, Deaf, Mute & Lame Signs

Blind

Aries, Leo, Sagittarius

Deaf

Taurus, Virgo, Capricorn

Mute

Gemini, Libra, Aquarius

Lame

Cancer, Scorpio, Pisces

Day & Night Signs

☀️ Day Signs (Strong by Day)
AriesTaurusGemini CancerSagittariusCapricorn
🌙 Night Signs (Strong by Night)
LeoVirgoLibra ScorpioAquariusPisces

Signs & Body Parts of the Kalapurusha

Afflictions to planets in a particular sign may manifest as health issues in the corresponding body part. This is useful for assessing physical constitution and potential health challenges.

AriesHead, Forehead, Brain
TaurusFace, Throat, Eyes
GeminiShoulders, Arms
CancerChest, Heart, Lungs
LeoStomach, Digestive Cavity
VirgoNavel, Intestines
LibraLower Abdomen
ScorpioReproductive Organs
SagittariusThighs, Hips
CapricornKnees
AquariusAnkles, Calves, Heel
PiscesFeet

Sign Karakatwas (Significations)

Just as entering a musician's home naturally reveals musical instruments and books, one must imagine how a sign and its lord naturally express themselves. Sign significations come not just from the sign lord but also from the nakshatras within that sign.

Aries

Dynamic, enthusiastic, head, forests, prominent forehead, impulsive, leadership, lean build

Taurus

Beautiful face, stable, slow, reliable, luxurious surroundings, beautiful teeth, large eyes, sturdy

Gemini

Communication, journalism, schools, telephones, newspapers, wires, learned, jovial, broad chest

Cancer

Heart, water fields, rivers, kitchen, food, attractive, small build, emotional, deep attachment, maternal, sensitive

Leo

Mountains, forests, caves, palaces, gardens, forts, steel mills, regal, proud, domineering, self-respecting

Virgo

Libraries, fields, intelligent, sharp speaker, nervous, physically lean, discriminating, analytical

Libra

Businessman, markets, banks, hotels, entertainment parks, cosmetics, balanced, diplomatic, good speaker

Scorpio

Private parts, deep caves, mines, garages, small build, intense eyes, secretive, occult, best friend or worst enemy

Sagittarius

Thighs, royalty, lawyers, government offices, aircraft, muscular, deep eyes, honest, athletic

Capricorn

Knees, water places, animals, shrubs, long neck, prominent teeth, witty, perfectionist, patient, secretive

Aquarius

Charity, philosophy, tall, bony, small eyes, mountain springs, watery places, hardworking, honest

Pisces

Feet, oceans, seas, jails, hospitals, short, chubby, large eyes, large brows, lazy, emotional, timid, honest

Signs in Horoscope Analysis

If we understand logically how to layer one concept over another, predictive astrology is not as difficult as it seems. Build your understanding step by step:

1Lagna alone
2Lagna + Rasi (Sign)
3Lagna + Rasi + Bhava (House)
4Lagna + Rasi + Bhava + Graha (Planet)
5Lagna + Rasi + Bhava + Graha + Nakshatra
6Lagna + Rasi + Bhava + Graha + Nakshatra + Nakshatra Lord Position

Conclusion

Summary

Every sign from the Lagna is counted as a house. Examine the sign a planet is in, whether it is exalted or debilitated there, where the sign lord is placed, and where the nakshatra lord is positioned — all of these together form the basis of Bhava analysis.

Signs, favorable signs for each planet, favorable nakshatras, and favorable house positions from the Lagna — understanding these fundamentals is the foundation of accurate astrological prediction.

On this page Introductionఉపోద్ఘాతం