జాతక దోషాలు
ఉపోద్ఘాతం
జ్యోతిష్యపరంగా జాతక చక్రంలో గ్రహాలను పరిశీలించి ఆ జాతకుడి జీవితంలో ఏ విషయాలు బాగుంటాయి, ఏ విషయంలో సమస్యలు రావచ్చు, అని అంచనా వేసి మంచి చెడు ఎప్పుడు జరుగుతుందని దశను విశ్లేషించి తెలియజేస్తారు.
కొన్ని గ్రహాల సంబంధం, గ్రహలు ఉండే స్థానాలు, గ్రహ నక్షత్ర స్థితి ఇలాంటివి ఆధారంగా చేసుకుని అవి బాగున్నాయా లేదా అని అంచనా వేస్తారు.
కేంద్ర కోణాధిపతుల కలయిక రాజయోగంగా పరిగణిస్తారు, యోగం అంటే దక్కేది, దోషం అంటే దక్కేదాన్ని దక్కనివ్వకుండా ఆపేది. ఈ వ్యాసం ద్వారా కొన్ని విషయాలు తెలియజేస్తాను. సహజంగా జాతక చక్రం పరిశీలించినప్పుడు మీరు మరింత మెరుగ్గా చెప్పడానికి ఉపయోగపడుతుంది.
గ్రహ దోషాలు
కొన్ని గ్రహాల సంబంధాన్ని దోషంగా పరిగణిస్తారు, ఎందుకు అలా పరిగణిస్తారు, దాని తీవ్రతను ఎంతవరకు అర్థం చేసుకోవాలి, అది ఏ విషయంలో ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది అనేది తెలుసుకుందాం.
రవి - రాహులు
చంద్ర - కేతులు
కుజ - రాహులు
బుధ - రాహువులు
గురు - రాహువులు
శుక్ర - కేతువులు
శని - రాహులు
రవి - శనులు
రెండు గ్రహాల మధ్య సంబంధాలను ఐదు రకాలుగా పరిశీలించవచ్చు.
కలయిక
దృష్టి
షష్ఠాష్టకం
పాపార్గళం
పరివర్తన
రాశి - స్థూల పరివర్తన
నక్షత్ర - సూక్ష్మ పరివర్తన
రెండు గ్రహాలు ఒకే రాసి లో ఉంటే దానిని కలయిక అంటారు. దీనిని మనం ఫెవికాల్ బంధంగా గుర్తుపెట్టుకోవచ్చు.
అవి ఒకే నక్షత్రంలో ఉంటే వాటి బంధం ఇంకా గట్టిగా ఉంటుంది. దీనిని ఫెవి క్విక్ బంధంగా గుర్తుపెట్టుకోవచ్చు.
ఒకవేళ ఒకే నక్షత్ర పాదంలో ఉంటే మరింత విడదీయరాని విధంగా ఉంటుంది. దీనికి మీరే పేరు పెట్టండి.
ఒకే డిగ్రీలో గనక ఉంటే వాటి బంధం విడదీయరానిది. అయితే ఒకే డిగ్రీలో ఉన్నప్పుడు రాహు కేతువుల వంటి గ్రహాలు వెనక్కి వెళుతూ ఇతర గ్రహాలు ముందుకు వెళ్లి వాటిని గుద్దుకునే అవకాశం ఉంది, ఇలాంటి సందర్భాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలించాలి.
ఆగ్రహం రాహుకేతువులని దాటినప్పుడు ప్రమాదం దాటిందని అర్థం చేసుకోవాలి, అలాంటప్పుడు దాని తీవ్రత తగ్గుతూ ఉంటుంది.
భావ దోషాలు
భావ దోషం నిర్ణయించడానికి, ప్రతి భావమునకు కారకుడు, భావములో ఉన్న గ్రహములు, భావాధిపతి , దశనాదులు యొక్క పరిస్థితిని పరిశీలించాలి.
పితృ దోషం
మాతృ దోషం
గురు దోషం
సంతాన దోషం
బాతృ దోషం
ఆయుర్దాయ దోషం
బాలారిష్ట దోషం
శత్రు, రోగ - దోషం
కళత్ర దోషం
కర్మ దోషం
ఇతర దోషములు
సర్ప దోషం
కాలసర్ప దోషం
కుజ దోషం
వ్యయంలో కుజరాహువులు
గోచారం
ఏలినాటి శని , అష్టమ శని, అర్ధాష్టమ శని
రాహు, కేతువుల సంచారము
వక్ర గ్రహాలు, కుజ స్తంభన
గురు సంచారము, గురు బలం
శని గ్రహ అనుకూల సంచారం
గ్రహ దోషాలు
శని - రాహులు
శని మరియు రాహు గ్రహాలు రెండు సహజమైన పాప గ్రహాలు, ఒకటి కాలానికి మరొకటి కర్మకు ప్రతిరూపాలు.
పూర్వకర్మ ఆధారంగా జాతక చక్రంలో వారి స్థితి ఏర్పడుతుంది, మనం నక్షత్ర జ్యోతిష్యం ఆధారంగా దాన్ని జాగ్రత్తగా పరిశీలించుకుని దాన్ని ప్రభావం ఏ మేరకు ఉంది,దాని ఫలితం ఎప్పుడు కలగడానికి అవకాశం ఉంది,అని మనం గమనించాల్సి ఉంటుంది, ఎందుకంటే ఒకే సంవత్సరంలో పుట్టిన అనేక వ్యక్తుల జాతకాలలో అదే గ్రహస్థితి ఉంటుంది,అందరికీ ఒకే రకమైన ఫలితాన్ని ఇవ్వదు.
శని అదే రాశికి తిరిగి రావడానికి దాదాపు 30 సంవత్సరాలు పడుతుంది, రాహు కి సుమారుగా 18 సంవత్సరాలు పడుతుంది. ఇలాంటి రెండు గ్రహాలు ఏదో ఒక రాశిలో కలవడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది,కాబట్టి రెండు పాప గ్రహాల కలయిక ఎన్నడూ శుభత్వంగా పరిగణించబడదు.
పాప గ్రహాలు ఎప్పుడు ఉపచయ స్థానాల్లో ఉంటే ఆరాట పోరాట, ప్రయత్నంతో జాతకుడు విజయాన్ని పొందగలుగుతాడు.
కేవలం శని రాహులను చూసి ఆ జాతకం బాలేదని నిర్ణయించకూడదు. ఆ రెండు గ్రహాలు విపరీతమైన ధోరణి కలిగిన గ్రహాలు కనుక విపరీతమైన మనస్తత్వం జాతకుడికి ఇచ్చే అవకాశం ఉంటుంది.
రాహు కేతువులతో ఏదైనా గ్రహం కలిసినప్పుడు ఒక రకమైన దోషాన్ని పొందుతాయి. ఎందుకంటే రాహువు సర్పము యొక్క తలగా విషాన్ని కలిగి ఉంటాడని భావిస్తారు. గ్రహణ సందర్భంలో సూర్యుడు రాహుతో కలుస్తుంటాడు ఇదే విధంగా ఏ గ్రహమైన రాహుతో కలిసిన ప్రమాదకారిగా పరిగణించడం సాంప్రదాయ జ్యోతిష్యం యొక్క ఆనవాయితీ.
మనం ఇంతకుముందు రాసుకున్న వ్యాసాల ఆధారంగా అవి ఒకే నక్షత్రంలో ఉన్నాయా, ఒకే రాశిలో ఉన్నాయా, ఓకే డిగ్రీలో ఉన్నాయా అని జాగ్రత్తగా పరిశీలించుకుని నిర్ణయాన్ని తెలియజేయాల్సింది ఉంటుంది.
ఒకే రాశిలో శని మరియు రాహువు కలిసిన అంత మాత్రాన ఏమీ జరగదు. వారి నక్షత్రాలను ఆధారంగా చేసుకుని పరిశీలించాల్సి ఉంటుంది.
ఈ రెండు గ్రహాలు ఒకే నక్షత్రంలో ఉంటే కచ్చితంగా దాని నక్షత్రాధిపతి రెండు, పదకొండు స్థానాలలో లేకపోతే అంత సునాయాసంగా శుభ ఫలితాన్ని ఇవ్వదు.
కొన్ని సందర్భాలలో ఇనుముని వంచడానికి సుత్తిని వాడక తప్పదు. నిప్పుల కొలిమిలో ఇనుప ముక్కని పెట్టి వంచడం అసాధ్యం, అలాగే కొంతమంది యోధులు అసాధ్యం వంటివి సాధించిన వారి జాతకంలో ఈ గ్రహాలు అనుకూలంగా ఉండే అవకాశం చాలా మెండుగా ఉంది. కాబట్టి ప్రతి విషయానికి అనుకూల ప్రతికూలతలు కలుగుతూ ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా బేరిజు వేసుకుని ఫలిత నిర్ణయం చేయాలి.
ఒక సమయం చెడుగా నిర్ణయించబడితే అప్పుడు ఇవన్నీ కూడా కారణాలుగా చూపించబడతాయి.
అదంతా కాదు ఏం జరుగుతుందో చెప్పండి అని అడుగుతారా? విపరీత ధోరణి కలగజేస్తుంది. నువ్వు తూర్పు వైపు వెళ్లడం అంటే, నేను పడమరకు ఎందుకు వెళ్లకూడదు అని అడుగుతారు. నేను వెళ్లి సాధించి నిరూపిస్తాను, అది తప్పని చెప్తారు. నేను కాల్చుకుంటే నేనే కాల్చుకొని తెలుసుకుంటాను అని చెప్తారు.
శని మరియు రాహులు ఆ లగ్నమునకు యోగకారకమైన నక్షత్రాలలో ఉండడం గానీ నక్షత్ర నాధుడు యోగ కారకుడుతో కలిసి ఉండడం గానీ, కేంద్రాధిపతితో సంబంధం పొందడం గానీ ఇలా రకరకాలుగా జరిగినప్పుడు అవి శుభ ఫలితాలు కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది.
ఇక ప్రతి గ్రహం గురించి క్లుప్తంగా తెలియజేస్తాను. ఇదే విషయాన్ని మళ్లీ మళ్లీ చెప్పినా కూడా మీకు బోర్ కొడుతుంది.
చంద్ర - కేతులు
చంద్రుడు మనః కారకుడు, మానసిక వేగాన్ని ప్రపంచంలో ఏ వేగము అందుకోలేదు, ఏ విషయాన్ని కదలనియకుండా చేసేవాడే కేతువు, ఇలాంటి రెండు గ్రహాల కలయిక పరస్పర విరుద్ధమైనది.
చంద్రకేతుల కలయిక వల్ల మానసిక సంఘర్షణ ఒత్తిడి వంటివి ఏర్పడే అవకాశం ఉంటుంది, చంద్రుడు మాతృ కారకుడు కావున తల్లికి దూరంగా ఉండడం గానీ, తల్లి ఆరోగ్య వ్యవహారాల్లో గాని, మానసిక రుగ్మతలు, మానసికంగా అనుకున్న విషయం తక్షణమే జరగటం లేదన్న బాధ గాని, ఇలా ఏదో ఒకటి వెంటాడే అవకాశం ఉంటుంది.
ప్రతిసారి నక్షత్రాలను పరిశీలించాలని పదేపదే చెప్తాను.
రవి - రాహువులు
రవి రాహువుల కలయికని పితృ దోషంగా పరిగణిస్తారు. రవి పితృ కారకుడు కనుక రాహు యొక్క విష ప్రభావం చేత, తండ్రి యొక్క లేక అధికారుల యొక్క సహాయ సహకారాలు, సకాలంలో అందకుండా జాతకుడు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది.
ఒక్కోసారి విపరీత అహంకారంతో అవకాశాన్ని జాతకుడు చేజార్చుకునే అవకాశం కూడా ఏర్పడుతుంది.
రవి ఆరోగ్యానికి కారకుడు. కాబట్టి రాహు ప్రభావం చేత ఒకసారి స్థిరమైన ఆరోగ్యం లేక దీర్ఘకాలిక రోగములతో బాధపడే అవకాశం కూడా ఉంటుంది.
ఇదే గ్రహస్థితి అనుకూలంగా ఏర్పడిన, ఇతరుల అహంకారాన్ని అణిచేవాడుగా మారవచ్చు.
రవి పితృ కారకుడు, రాహువు నవమ స్థానంలో ఉండడం పితృ దోషము, ఇలాంటి గ్రహస్థితి దుస్థానములలో తొమ్మిదవ స్థానంలో ఏర్పడిన చాలా జాగ్రత్తగా పరిశీలించాలి.
ఏ గ్రహం యొక్క విపరీత ధోరణి అయినా అనుకూల ప్రతికూలతను అంచనా వేసుకుని మాత్రమే, ఫలిత జ్యోతిష్యం నిర్ణయం చేయాలి.
ఇన్ని చెప్తున్నారు కాబట్టి వీటన్నిటికీ ఏ విధంగా పరిహారాలు చెప్పండి, అన్ని ప్రశ్న తలెత్తుతుంది, పూర్వ కర్మను అర్థం చేసుకుని తిరిగి ప్రకృతికి సత్కారము చేస్తూ వెళ్లడమే, ఎందుకంటే చెప్పేవాడు మానవ మాత్రుడు అని గమనించాలి.
గురు - రాహువులు
గురువు పుత్రకారకుడు, జ్ఞానమునకు, ధనమునకు కారకుడు కాబట్టి రాహుతో చేరిన తన కారకత్వాలనుగా పూర్తిగా కోల్పోయే అవకాశం ఉంటుంది.
కొన్ని సందర్భాలలో ఆయా లగ్నములకు గురువు పాపి అయిన అఖండ జ్ఞానాన్ని ఇచ్చి, సంతానం ఇవ్వకుండా ఉండే అవకాశం ఉంటుంది.
గురువు మన మీద ఎదుటి వారికి ఉండే నమ్మకాన్ని, విశ్వాసాన్ని, పేరు ప్రతిష్టలను, గౌరవాన్ని తెలియజేస్తాడు. రాహువుతో షష్ఠాష్టకం, నక్షత్ర సంబంధము ఇలాంటివి ఏర్పడినప్పుడు కోర్టు వివాదాలు, లిటిగేషన్లు వంటివి జరిగే అవకాశం ఉంటుంది.
కుజ - రాహులు
మేష, వృశ్చిక రాశిలకు అధిపతి అయిన కుజుడు యుద్ధ వీరుడు తర్క స్వభావి, నిజాన్ని తెలుసుకోవాలని కుతూహలం కలిగినవాడు.
రాహువు సర్పం యొక్క తల విషముగా పరిగణిస్తారు, మాయ మోసం వంటి వాటికి రాహువు అధిపతి.
ఎప్పుడైతే ఈ రెండు గ్రహాలు కలుస్తాయో, అయితే మోసం చేయడం ఐనా, మోసపోవడం ఐనా, లేక మోసాన్ని తెలుసుకునే విపరీతమైన శక్తిని జ్ఞానాన్ని కలిగి ఉండడం ఐనా జరుగుతుంది.
ఇది ఈనాటి సమాజంలో డబ్బులు ఎదుటి వాళ్ళకి ఇస్తే తిరిగి రాకపోవడం, వ్యాపారంలో ఇతర భాగస్వాముల చేత నష్టపోవడం లేక ఉద్యోగంలో స్థిరత్వం, కుజుడు శక్తికి కారణం కాబట్టి,అనుకున్న విషయాన్ని ఆచరణలో పెట్టలేకపోవడం, డబ్బులు పోగొట్టుకోవడం, అన్నదమ్ముల్లో వివాదాలు గాని, వాళ్లు స్థిరత్వం లేని జీవితం గడపడం గాని జరగవచ్చు.
ఒకవేళ కుజరాహువులు అనుకూలంగా స్థితి చెందితే కచ్చితంగా ఉన్నతమైన పరిశోధనా శాఖ, ఎథికల్ హ్యాకింగ్, సాఫ్ట్వేర్ టెస్టింగ్, కొత్త విషయాలను కనిపెట్టడం, ఉద్యోగ పరంగా ఎవ్వరూ చేయలేనంత పనిని చాకచక్యంగా అనూహ్యంగా చేయడం వంటి వాటితో, ప్రత్యేకమైన పేరును, డబ్బును సంపాదించుకోగలుగుతారు.
కుజ రాహువులు ముఖ్యంగా 12వ స్థానంలో స్థితి చెంది ఉన్నా జాతకులు ఎంతో ధనాన్ని నష్టపోవడం నేను గమనించాను.
కుజ రాహువుల కలయిక లేక సంబంధం ఉన్నవాళ్లు ఏ విషయాన్ని అంత సునాయాసంగా నమ్మలేరు, ఏదైనా కళ్ళతో చూసి పరిశీలన, పరిశోధన, ప్రయోగం వంటివి చేసి మాత్రమే ఒక అంచనాకి రాగలుగుతారు.
కుజుడు సహజంగా లుబ్దుడు, ఆశాపరుడు, రాహు తో సంబంధం వలన అత్యాశకు దురాశకు చివరికి దుఃఖానికి లోనవుతాడు, అనుకూలంగా ఉంటే సంపాదించుకునే అవకాశం కూడా ఉంటుంది. ఆ జాతక చక్రంలో గురువు అనుకూలంగా ఉంటే ధర్మ మార్గంగాను, గురు యొక్క ప్రాధాన్యత లేకపోతే అధర్మం లో అయినా అత్యార్జన చేయవచ్చు.
కుజ రాహువుల సంబంధాన్ని సర్ప దోషంగా కూడా పరిగణిస్తారు, స్త్రీ జాతకంలో కుజ రాహుల సంబంధం వలన ఒక్కోసారి నెలసరి సంబంధమైన (రుతుక్రమానికి) ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది.
బుధ - రాహువులు
బుధుడు ఆలోచన కారకుడు, రాహు తో కలిసినప్పుడు దురాలోచన ఇస్తాడు, అంటే దొంగతనం, పన్నాగం పండడం వంటివి.
ఈనాటి ప్రపంచంలో మనం బోలెడన్ని సైబర్ క్రైమ్స్ చూస్తున్నాము వీటన్నిటికీ బుధ రాహువులు, కుజ రాహువులు,ఎక్కువగా కారణమవుతారు.
చాలామంది చార్టెడ్ అకౌంటెంట్ వారి జాతకాల్లో బుధ రాహువులు బాగా కనిపిస్తారు. సహజంగా వృత్తిపరంగా ఆదాయపు పన్ను వంటివి ప్రభుత్వానికి ఎలా తక్కువ చెల్లించవచ్చు, అనేదే వారి ప్రధాన ఉద్యోగం.
అనుకూలంగా ఉన్నప్పుడు తెలివితేటలు సద్వినియోగంలోకి వస్తాయి. అనేక రకాల వ్యాపారాల మీద ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. ప్రతి విషయంలోనూ మోసాన్ని గ్రహించగలుగుతారు.
బుధ రాహు సంబంధం ప్రతి విషయాన్ని షార్ట్ కట్ లో చేయాలని ఆలోచనలు కలగజేస్తాయి.
ప్రతికూలంగా ఉన్నప్పుడు ప్రతి ఐడియా ఫ్లాప్ అవుతుంది.
శుక్ర - కేతువులు
కేతువు మోక్ష కారకుడు అయితే, శుక్రుడు బోగ కారకుడు.
ఇలాంటి రెండు విరుద్ధమైన గ్రహాలు కలిసినప్పుడు మానసిక అశాంతిని ఇస్తాడు, సౌఖ్యం యొక్క అనుభూతిని పొందనివ్వకుండా నిరుత్సాహాన్ని ఇస్తాయి.
జీవితంలో ఏదీ సొంతం కాదని, మనకు ఏ రకమైన సౌఖ్యం దక్కదు అనే రకమైన ధోరణిని కలగజేస్తాయి.
ఎంత అనుకూలంగా ఉన్నా అంత సునాయాసంగా శుభ ఫలితాన్ని ఇవ్వవు, అవి ఏ నక్షత్రంలో ఉన్నాయి ఒకే నక్షత్రంలో ఉన్నాయా లేదా అని మనం జాగ్రత్తగా పరిశీలించాలి. నక్షత్ర నాథుడు బాగోకపోతే ఇక మనం చెప్పాల్సిన పని లేదు. అశాంతి చివర అంచు ఎక్కడ ఉందో చెప్పగలుగుతారు.
శుక్ర కేతువుల వల్ల expressive నేచర్ ఉండదు. ఒక రకమైన మూడి మనస్తత్వం కలిగి ఉంటారు. వాళ్లని బాగా ఉత్తేజ పరిస్తే తప్ప, ఒక్క మాట కూడా బయటికి సరిగ్గా రాదు.
యోగులకు, సన్యాసులకు ఈ యోగం అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే వారికి జీవితంలో సుఖం మీద ప్రాముఖ్యత ఉండదు కాబట్టి.
రవి - శనులు
రవి శనులు పరస్పర శత్రు గ్రహాలు. రవి సుపీరియరిజం కలిగిన ఒక గ్రహం, శని ఈక్వాలిటీని నమ్మే ఒక గ్రహం. ఇలాంటి రెండు విరుద్ధమైన గ్రహాలు కలిసినప్పుడు వారి యొక్క ఆలోచనలు సంఘర్షణకి గురవుతాము.
రవి శనులు విడిపోవడం జరిగింది, దీనివల్ల ఒక్కోసారి తండ్రి కొడుకులు దూరంగా ఉండడం గానీ, తండ్రి గాని కొడుకు గాని విపరీతమైన కష్ట పేడే వారు అయ్యుంటారు.
రవిశనుల వల్ల శారీరక శ్రమ అధికంగా ఉంటుంది, okko సారి బరువులు మోసే వాళ్లు, కష్టాన్ని అనుభవించే వాళ్ళకి,రవి శనుల గ్రహస్థితి ఏర్పడుతుంది.
మీకో సందేహం రావచ్చు పెద్ద పెద్ద వాళ్ళ జాతకాలలో రవిశని గ్రహాలు ఉన్నాయి కదా, మరి వాళ్ళు ఎలా వెళ్లారు అని అంటే, కష్టపడి ఒక్కో మెట్టు ఎక్కి వాళ్ళు సాధించుకున్నట్టే.
ఒక నెత్తి మీద మోయలేనంత బరువు ఉన్న వ్యక్తికి ఒక ఉచిత సలహా గనక ఇస్తే ఆ వ్యక్తికి చిరెత్తుకు రావడం చాలా సహజం. కాబట్టి రవి శనుల కలయిక ఉన్న వాళ్ళకి మనం సలహా ఇస్తే అంతే కోపం కలుగుతుంది. వాళ్లు ఒక ఆటిట్యూడ్ లో వాళ్ళు చేయాలనుకున్న రీతిలో చేసుకుంటూ పోయే మనస్తత్వం కలిగి ఉంటారు.
వాళ్లకి ఒక విషయం కావాలి అని అంటే ఎంతో అనుకూలంగా ప్రవర్తిస్తుంటారు, వద్దు అంటే తెంచుకోవడానికి సిద్ధంగా కూడా ఉంటారు. కాబట్టి రెండు వైపులా పదునున్న కత్తితో జాగ్రత్తగా వ్యవహరించాలి.
అనుకూలంగా ఉన్న వాళ్ళు గొప్ప మేనేజ్మెంట్ పొజిషన్స్ లో, పొలిటికల్ లైఫ్ లో ఎదుగుతారు.
ప్రతికూలంగా ఉన్నవాళ్లు అధికారుల ఒత్తిడి తట్టుకోలేక ఉద్యోగంలో ఎదుగుదల లేక కష్ట జీవితాన్ని అనుభవిస్తుంటారు. మిగిలిన విషయాలు అన్నీ గ్రహ స్థితిని బట్టి కాలాన్ని బట్టి నిర్ణయించాలి.
భావ దోషాలు
పితృ దోషం
"పితృ" అంటే పూర్వీకులు (తండ్రి/తాత ముత్తాతలు). జ్యోతిష్యశాస్త్రంలో సూర్యుడు తండ్రికి కారకుడు. మన పూర్వీకులు చేసిన పాపాలు, లేదా వారు తమ పెద్దలను నిర్లక్ష్యం చేయడం వల్ల ఏర్పడిన కర్మ ఫలాన్నే "పితృ దోషం" అంటారు. ఇది పూర్వీకుల రుణం లాంటిది, దీనిని వారి వంశస్థులు తీర్చాల్సి ఉంటుంది.
ముఖ్యమైన అపోహలు - వాస్తవాలు:
అపోహ: పితృ దోషం అంటే పూర్వీకుల శాపం.
వాస్తవం: ఇది శాపం కాదు, పూర్వీకుల రుణం. గత జన్మలో వృద్ధులను గౌరవించకపోవడం లేదా వారికి చేయాల్సిన కర్మకాండలు (శ్రాద్ధ కర్మలు) సక్రమంగా నిర్వహించకపోవడం వల్ల ఈ దోషం కలుగుతుంది.
పితృ దోషం వల్ల కలిగే దుష్ప్రభావాలు:
జాతకంలో ఈ దోషం ఉంటే జీవితంలో అనేక రకాల ఇబ్బందులు ఎదురవుతాయి:
వివాహం & సంతానం: వివాహం ఆలస్యం కావడం, వైవాహిక జీవితంలో గొడవలు, సంతానం కలగకపోవడం లేదా గర్భస్రావాలు జరగడం.
ఆరోగ్యం: కుటుంబ సభ్యులకు తరచుగా అనారోగ్య సమస్యలు రావడం, మందులకు లొంగని వ్యాధులు.
ఆర్థికం: ఎంత కష్టపడినా ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధలు, పేదరికం, ఉద్యోగంలో స్థిరత్వం లేకపోవడం.
కుటుంబం: ఇంట్లో ప్రశాంతత లేకపోవడం, చిన్న విషయాలకే గొడవలు, అకస్మాత్తుగా ప్రమాదాలు లేదా మరణాలు సంభవించడం.
మానసిక స్థితి: మానసిక ప్రశాంతత లోపించడం, ఏ పనీ పూర్తి చేయలేకపోవడం.
మాతృ దోషం
జ్యోతిష్య శాస్త్రంలో తల్లికి, మనశ్శాంతికి కారకుడు 'చంద్రుడు'. అలాగే జాతక చక్రంలో 4వ ఇల్లు (చతుర్థ స్థానం) తల్లిని సూచిస్తుంది. ఈ రెండింటిపై పాప గ్రహాల ప్రభావం ఉన్నప్పుడు 'మాతృ దోషం' ఏర్పడుతుంది. దీని ప్రభావం తల్లి ఆరోగ్యంపైనా, జాతకుడి సుఖంపైనా ఉంటుంది.
వ్యక్తిగత స్వభావం: జాతకుడు మూర్ఖుడిగా, దీనంగా, చంచల స్వభావంతో ఉంటాడు.
విద్య & నివాసం: విద్యలో ఆటంకాలు (విద్యావిఘ్నాలు) ఏర్పడతాయి. సొంత ఊరిలో కాకుండా పరదేశాలలో లేదా ఇతరుల ఇళ్ళలో నివసించాల్సి వస్తుంది (పరదేశ నివాసి).
మాతృ సౌఖ్యం: తల్లి ప్రేమకు దూరమవుతాడు లేదా తల్లికి దూరంగా పెరుగుతాడు. తల్లి ఆరోగ్యం బాగుండదు.
మాతృ దోషం యొక్క సాధారణ ఫలితాలు
ఈ దోషం ఉన్నవారి జీవితంలో ఈ క్రింది సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది:
తల్లికి: తరచుగా అనారోగ్య సమస్యలు, దీర్ఘకాలిక వ్యాధులు, లేదా ప్రమాదాలు.
తండ్రికి: తండ్రికి కూడా గండం లేదా ప్రమాదాలు జరిగే అవకాశం.
కుటుంబం: గృహంలో ఎప్పుడూ గొడవలు (గృహచ్ఛిద్రాలు), అశాంతి, సుఖం లేకపోవడం.
మానసిక స్థితి: జాతకుడికి మానసిక ప్రశాంతత ఉండదు, చిన్న విషయాలకే ఆందోళన చెందుతాడు.
ఇతర ఫలితాలు: స్థిరాస్తి నష్టాలు, పరస్త్రీ వ్యామోహం, పరస్థాన వాసం (వేరే చోట ఉండటం).
గురు దోషం
జ్యోతిష్య శాస్త్రంలో 'గురుడు' (బృహస్పతి) అత్యంత శుభ గ్రహం. గురుడు జ్ఞానానికి, ధనానికి, సంతానానికి మరియు అదృష్టానికి కారకుడు. జాతక చక్రంలో గురుడు బలహీనపడినా లేదా పాపగ్రహాల ప్రభావానికి లోనైనా "గురు దోషం" ఏర్పడుతుంది. దీనినే కొన్ని సందర్భాల్లో 'గురు చండాల యోగం' (రాహువుతో కలిసినప్పుడు) అని కూడా అంటారు.
గురు దోషం ఎలా ఏర్పడుతుంది?
నీచ స్థితి: గురుడు మకర రాశిలో ఉన్నప్పుడు నీచ స్థితిని పొందుతాడు (బలహీనపడతాడు).
పాప గ్రహాల కలయిక: గురుడు రాహువు లేదా కేతువు వంటి పాపగ్రహాలతో కలిసినప్పుడు.
దుస్థానాలు: గురుడు 6, 8, లేదా 12వ ఇళ్ళలో ఉన్నప్పుడు తన శుభ ఫలితాలను ఇవ్వలేకపోవచ్చు. ( conditions & exceptions we have to consider )
గురు దోషం యొక్క ప్రధాన లక్షణాలు & ప్రభావాలు
గురు దోషం ఉన్నవారి జీవితంలో ఈ క్రింది సమస్యలు ప్రధానంగా కనిపిస్తాయి:
విద్యా ఆటంకాలు: తెలివితేటలు ఉన్నప్పటికీ చదువులో వెనుకబడిపోవడం, ఏకాగ్రత లోపించడం లేదా మధ్యలోనే చదువు ఆపేయడం.
ఆర్థిక ఇబ్బందులు: ఎంత సంపాదించినా డబ్బు నిలవకపోవడం, అనవసరమైన ఖర్చులు, ఆర్థికంగా ఎప్పుడూ ఇబ్బందుల్లో ఉండటం.
వివాహ ఆలస్యం: గురు దోషం ఉంటే వివాహం ఆలస్యం కావడం లేదా వైవాహిక జీవితంలో గొడవలు రావడం జరుగుతుంది.
సంతాన సమస్యలు: గురుడు పుత్ర కారకుడు. ఈ దోషం వల్ల సంతానం కలగకపోవడం లేదా పిల్లల వల్ల మనశ్శాంతి లేకపోవడం జరుగుతుంది.
గౌరవ లోపం: సమాజంలో గౌరవం తగ్గడం, చేయని తప్పులకు నిందలు పడటం.
ఆరోగ్యం: కాలేయ (Liver) సంబంధిత వ్యాధులు, మధుమేహం (Diabetes), లేదా ఊబకాయ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
భ్రాతృ దోషం
జ్యోతిష్య శాస్త్రంలో లగ్నం నుండి 3వ ఇల్లు (తృతీయ స్థానం) సోదర సోదరీమణుల గురించి (ముఖ్యంగా తమ్ముళ్ళు, చెల్లెళ్ళు), పరాక్రమం మరియు ధైర్యం గురించి తెలియజేస్తుంది.
Affliction of 3rd house, Karaka planet Mars, Lord, Occupant connection with too many malefic influence or rahu/ketu connection can spoil the relationship or aggressive communications. Brother settlement issues. Inside of the family there is less support.
ఆయుర్దాయ దోషం
జ్యోతిష్య శాస్త్రంలో 8వ ఇల్లు (అష్టమ స్థానం) ఆయుష్షును సూచిస్తుంది. ఆయుష్షుకు కారకుడు 'శని' (Saturn). లగ్నం (శరీరం), 8వ ఇల్లు మరియు శని గ్రహం బలహీనపడినప్పుడు ఈ ఆయుర్దాయ దోషాలు ఏర్పడతాయి. వీటిని ప్రధానంగా మూడు రకాలుగా విభజించవచ్చు.
బాలారిష్ట దోషం (చిన్నతనంలో గండం)
పుట్టిన పిల్లలకు చిన్నతనంలోనే ఆరోగ్యం క్షీణించడం లేదా ప్రాణగండం ఉండటాన్ని 'బాలారిష్ట దోషం' అంటారు.
చంద్రుడు: జాతకంలో చంద్రుడు బలహీనంగా ఉండి, 6, 8, లేదా 12వ ఇళ్ళలో ఉంటే లేదా పాపగ్రహాల (రాహు, కేతు, శని) చూపు ఉంటే ఈ దోషం వస్తుంది.
లగ్నాధిపతి: లగ్నాధిపతి (శరీరానికి కారకుడు) పాపగ్రహాలతో కలిసి బలహీనంగా ఉన్నా పిల్లలకు ఇబ్బంది.
Balarista sloka and explanation —-
RVA జ్యోతిష్య విధానంలో "బాలారిష్ట దోషాలు" (Balarista Doshas) అనేవి కేవలం చిన్నపిల్లలఆరోగ్యం లేదా ఆయుర్దాయానికి సంబంధించినవి మాత్రమే కాదు. వీటిని "దశ విశ్లేషణ" (Dasha Analysis) మరియు "గ్రహ బలం" (Planet Strength) నిర్ణయించడంలో కీలకమైన "నెగిటివ్పాయింట్స్" (Negative Checks) గా పరిగణిస్తారు.
సాంప్రదాయ జ్యోతిష్యంలో వీటిని చిన్నప్పుడే పోతాయి అనుకుంటారు, కానీ "ఆ గ్రహ దశవచ్చినప్పుడు కూడా ఆ దోషం ఫలితాన్ని తగ్గిస్తుంది".
1. 📜 బాలారిష్ట దోషాలు - మూల సిద్ధాంతం (Core Concept)
నిర్వచనం: "బాలారిష్టాలు అంటే కేవలం చిన్నప్పుడు వచ్చే గండాలు మాత్రమే కాదు. ఒకగ్రహం ఈ నిర్దిష్ట స్థానాల్లో (Specific Houses) ఉన్నప్పుడు, అది తన సహజత్వాన్ని కోల్పోయి, జాతకుడికిఆశించిన ఫలితాలను ఇవ్వడంలో విఫలమవుతుంది. చార్ట్ లో గ్రహం ఉచ్చలో ఉన్నా, స్వక్షేత్రంలోఉన్నా, అది బాలారిష్ట స్థానంలో ఉంటే దాని స్కోర్ (Marks) తగ్గిపోతుంది."
ముఖ్య ఉద్దేశ్యం:
- ఇది గ్రహానికి "రిసోర్స్ & పర్ఫార్మెన్స్" స్కోర్లో మార్కులు తగ్గించడానికి వాడే ఫిల్టర్.
- ఈ స్థానాల్లో ఉన్న గ్రహాల దశలు (Dashas) సాఫీగా సాగవు.
2. 📊 బాలారిష్ట దోషాల పట్టిక (The Balarista Table)
గురువుగారు క్లాస్ రూమ్ లో (ముఖ్యంగా తులా లగ్న విశ్లేషణలో) వివరించిన 9 గ్రహాల బాలారిష్టస్థానాలు మరియు వాటికి సంబంధించిన శ్లోక పాదాలు ఇవే:
3. 🧪 ఆచరణాత్మక ఉదాహరణ (Case Study - Libra Ascendant)
గురువుగారు తులా లగ్నానికి (Libra Ascendant) సంబంధించిన ఒక ఉదాహరణ ద్వారా, గ్రహాలుఉచ్చ/స్వక్షేత్రాల్లో ఉన్నా బాలారిష్ట దోషం ఎలా పనిచేస్తుందో వివరించారు.
చార్ట్ వివరాలు:
- లగ్నం: తుల (Libra).
- శని (Saturn): లగ్నంలో (తుల) ఉచ్చలో (Exalted) ఉన్నాడు.
- కుజుడు (Mars): 7వ ఇంట్లో (మేషం) స్వక్షేత్రంలో (Own House) ఉన్నాడు.
- రవి (Sun): 5వ ఇంట్లో (కుంభం) ఉన్నాడు.
RVA విశ్లేషణ (The Twist):
1. శని (Saturn): లగ్నంలో ఉచ్చలో ఉన్నాడు కదా, "శశ మహాపురుష యోగం" అనుకుంటాం. కానీRVA లో "జన్మ శని" (Saturn in 1st) అనేది బాలారిష్ట దోషం. కాబట్టి శని దశ ఆశించినంతఅద్భుతంగా ఉండదు. ఆరోగ్యం లేదా పర్సనాలిటీ పరంగా ఇబ్బంది పెడతాడు.
2. కుజుడు (Mars): 7లో స్వక్షేత్రం (మేషం). "రుచక మహాపురుష యోగం" అనుకోవచ్చు. కానీ"ధరణీసుత సప్తమంచ" (Mars in 7th) అనే దోషం వల్ల వైవాహిక జీవితంలో గొడవలుఖచ్చితంగా ఉంటాయి.
3. రవి (Sun): 5వ ఇంట్లో ఉన్నాడు. "అర్కస్తు పంచమః" అనే దోషం వల్ల సంతానం లేదా ఆదశలో అడ్డంకులు ఉంటాయి.
గురువుగారి తీర్పు: "గ్రహం ఉచ్చలో ఉందా లేదా స్వక్షేత్రంలో ఉందా అనేది పక్కన పెడితే, అదిబాలారిష్ట స్థానంలో ఉంటే కచ్చితంగా దాని ఫలితం తగ్గుతుంది. ఆ దశలో మనం జాగ్రత్తగా ఉండాలి. అందుకే తులా లగ్నానికి ఇన్ని దోషాలు ఒకేసారి వచ్చే అవకాశం ఉంది."
4. ⚠️ ముఖ్యమైన గమనికలు (Critical Notes)
1. ఎక్సెప్షన్స్ (Exceptions): గురువుగారు కొన్ని సందర్భాల్లో (ఉదా: విపరీత రాజయోగాలు లేదాప్రత్యేక లగ్నాలు) వీటికి మినహాయింపులు ఉండవచ్చని చెప్పారు కానీ, పాప గ్రహాలకు(Malefics) మాత్రం (శని, కుజ, రవి, రాహు, కేతు) ఈ దోషాలను సీరియస్ గానే పరిగణించాలి.
2. దశ అప్లికేషన్ (Dasha Application): ఈ దోషాలు కేవలం చిన్నప్పుడే పోతాయని అనుకోకండి. ఆ గ్రహ దశ వచ్చినప్పుడు (ఉదా: 30 ఏళ్ల వయసులో గురు దశ వచ్చినా), గురువు 3లో ఉంటేఆ దశ సాఫీగా సాగదు ("గురు తృతీయే" దోషం పనిచేస్తుంది).
3. రాహు/కేతు: రాహువు 9లో ఉంటే ఫాదర్ సపోర్ట్ ఉండకపోవచ్చు లేదా ఫాదర్ కి దూరంగాఉండాల్సి వస్తుంది. కేతువు 12లో ఉంటే "మోక్షానికి మంచిదే" కానీ భౌతిక జీవితానికి (డబ్బుదాచుకోవడం) మంచిది కాదు.
ఈ పట్టికను మరియు సూత్రాలను మీ అనాలసిస్ లో "స్టెప్-2: ప్లానెట్ కెపాసిటీ" లో వాడండి. మార్కులు వేసేటప్పుడు ఈ స్థానాల్లో గ్రహం ఉంటే 10-15 మార్కులు తగ్గించండి.
ఆయుర్దాయ దోషం
Maraka and Bhadaha connected with 4th house leads to death
Alapa, madyama, deerga,
శత్రు - రోగ దోషాలు
1-6 - health problems – not bed ridden
1-6-8 : matter over - bed ridden , influences bhadaka houses - suffering highest level
ముఖ్యమైన సూత్రాలు:
లగ్నాధిపతి బలం: జాతకంలో లగ్నాధిపతి (1st Lord) అష్టమాధిపతి (8th Lord) కంటే బలంగా ఉంటే, ఆ వ్యక్తి అనారోగ్యాలను జయించి దీర్ఘాయుష్షును పొందుతాడు.
శుభ గ్రహాల చూపు: 8వ ఇంటిపై లేదా లగ్నంపై గురువు వంటి శుభగ్రహాల చూపు ఉంటే, దోషాలు తొలగిపోయి 'పూర్ణ ఆయుర్దాయం' కలుగుతుంది.
శత్రు - రోగ దోషాలు
జ్యోతిష్య శాస్త్రంలో 6వ ఇల్లు రోగాలకు, శత్రువులకు మరియు రుణాలకు కారకత్వం వహిస్తుంది. గ్రహాల స్థితిని బట్టి ఎటువంటి రోగాలు లేదా శత్రు బాధలు కలుగుతాయో కింద చూడండి.
రోగ దోషాలు (అనారోగ్య సమస్యలు)
Write
శత్రు దోషాలు (Enemies & Conflicts)
Write
కళత్ర దోషం
Write
సంతాన దోషం & దత్తపుత్ర యోగం (Recap)
Write
కర్మ దోషం
జ్యోతిష్య మరియు ఆధ్యాత్మిక శాస్త్రాలలో చాలా ముఖ్యమైన అంశం. "మనం ఏమి విత్తుతామో, అదే పండిస్తాము" అనే సూత్రంపై ఇది ఆధారపడి ఉంటుంది.
గ్రహాలు కేవలం ఫలితాలను సూచిస్తాయి (Indicators), కానీ ఫలితాలు వచ్చేది మాత్రం మన కర్మ (Actions) నుంచే. కాబట్టి "మంచి చేస్తే మంచే జరుగుతుంది" అనే నమ్మకంతో సత్కార్యాలు చేయడం వల్ల కర్మ దోషాన్ని జయించవచ్చు.
ఇతర దోషములు
కాలసర్ప దోషం
జ్యోతిష్య శాస్త్రంలో 'కాలసర్ప యోగం' లేదా 'కాలసర్ప దోషం' అనేది ఒక విశేషమైన గ్రహ స్థితి. సర్పమునకు రాహువు తల, కేతువు తోక అవుతుంది. జన్మ కుండలిలో రాహు, కేతువుల మధ్య మిగిలిన ఏడు గ్రహాలు (రవి, చంద్ర, కుజ, బుధ, గురు, శుక్ర, శని) బంధింపబడి ఉంటే దానిని 'కాలసర్ప యోగం' అంటారు.
ఈ దోషం రెండు విధాలుగా ఉంటుంది:
సవ్య కాలసర్ప దోషం: గ్రహాలన్నీ రాహువు వైపు వెళ్తుంటే అది సవ్య కాలసర్ప దోషం.
అపసవ్య కాలసర్ప దోషం: గ్రహాలన్నీ కేతువు వైపు వెళ్తుంటే అది అపసవ్య కాలసర్ప దోషం (కేతువు - రాహువు మధ్య గ్రహాలు ఉండటం).
కాలసర్ప దోష రకాలు - వాటి ఫలితాలు
జాతక చక్రంలో రాహువు, కేతువుల స్థానాన్ని బట్టి ఈ దోషం 12 రకాలుగా విభజించబడింది. ఒక్కో రకానికి ఒక్కో పేరు మరియు నిర్దిష్ట ఫలితాలు ఉన్నాయి.
1. అనంత కాలసర్ప దోషం (1వ ఇల్లు - 7వ ఇల్లు)
స్థానం: లగ్నం నుండి సప్తమ స్థానం వరకు గ్రహాలన్నీ బంధింపబడి ఉంటే ఇది ఏర్పడుతుంది.
ఫలితాలు: ప్రతి పనిలో ఆటంకాలు, ఇబ్బందులతో కూడిన బతుకు భారం, జీవితమంతా పోరాటంలా అనిపిస్తుంది.
2. గుళిక కాలసర్ప దోషం (2వ ఇల్లు - 8వ ఇల్లు)
స్థానం: ధన స్థానం (2) నుండి అష్టమ స్థానం (8) మధ్య గ్రహాలు ఉంటే ఇది ఏర్పడుతుంది.
ఫలితాలు: తీవ్రమైన ఆర్థిక సమస్యలు, కుటుంబంలో అశాంతి.
ప్రభావం: సుమారు 27 సంవత్సరాల వయస్సు వరకు ఇబ్బందులు ఉంటాయి.
3. వాసుకి కాలసర్ప దోషం (3వ ఇల్లు - 9వ ఇల్లు)
స్థానం: తృతీయ స్థానం (3) నుండి భాగ్య స్థానం (9) మధ్య గ్రహాలు ఉంటే ఇది ఏర్పడుతుంది.
ఫలితాలు: అన్నదమ్ముల మధ్య కలహాలు, ఆస్తి తగాదాలు, తోబుట్టువులతో సమస్యలు.
ప్రభావం: సుమారు 36 సంవత్సరాల వయస్సు వరకు ఇబ్బంది కలిగిస్తుంది.
4. శంఖపాల కాలసర్ప దోషం (4వ ఇల్లు - 10వ ఇల్లు)
స్థానం: చతుర్థ స్థానం (4) నుండి రాజ్య స్థానం (10) మధ్య గ్రహాలు ఉంటే ఇది ఏర్పడుతుంది.
ఫలితాలు: తల్లికి ఆరోగ్య సమస్యలు లేదా తల్లితో విభేదాలు, వాహన ప్రమాద గండం, నివాస స్థల సమస్యలు.
ప్రభావం: సుమారు 42 సంవత్సరాల వరకు ఇబ్బంది కలిగిస్తుంది.
5. పద్మ కాలసర్ప దోషం (5వ ఇల్లు - 11వ ఇల్లు)
స్థానం: పంచమ స్థానం (5) నుండి లాభ స్థానం (11) మధ్య గ్రహాలు ఉంటే ఇది ఏర్పడుతుంది.
ఫలితాలు: సంతాన లేమి లేదా పిల్లలతో సమస్యలు, జీవిత భాగస్వామితో గొడవలు.
ప్రభావం: సుమారు 48 సంవత్సరాల వరకు ఇబ్బంది కలిగిస్తుంది.
6. మహా పద్మ కాలసర్ప దోషం (6వ ఇల్లు - 12వ ఇల్లు)
స్థానం: శత్రు స్థానం (6) నుండి వ్యయ స్థానం (12) మధ్య గ్రహాలు ఉంటే ఇది ఏర్పడుతుంది.
ఫలితాలు: దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు, అప్పుల బాధ, శత్రువుల నుండి ఇబ్బందులు.
ప్రభావం: సుమారు 58 సంవత్సరాల వరకు ప్రభావం ఉంటుంది.
7. తక్షక కాలసర్ప దోషం (7వ ఇల్లు - 1వ ఇల్లు)
స్థానం: సప్తమ స్థానం (7) నుండి లగ్నం (1) వరకు గ్రహాలు ఉంటే ఇది ఏర్పడుతుంది.
ఫలితాలు: వివాహ జీవితంలో ఇబ్బందులు, వ్యాపారంలో భారీ నష్టాలు.
8. కర్కోటక కాలసర్ప దోషం (8వ ఇల్లు - 2వ ఇల్లు)
స్థానం: అష్టమ స్థానం (8) నుండి ధన స్థానం (2) వరకు గ్రహాలు ఉంటే ఇది ఏర్పడుతుంది.
ఫలితాలు: భార్యతో గొడవలు, జీవితంలో అనుకోని దుస్సంఘటనలు, ఆకస్మిక నష్టాలు.
9. శంఖచూడ కాలసర్ప దోషం (9వ ఇల్లు - 3వ ఇల్లు)
స్థానం: భాగ్య స్థానం (9) నుండి తృతీయ స్థానం (3) వరకు గ్రహాలు ఉంటే ఇది ఏర్పడుతుంది.
ఫలితాలు: తండ్రికి కష్టాలు లేదా తండ్రి వల్ల ఇబ్బందులు, అత్యంత దురదృష్టకరమైన పరిస్థితులు.
10. ఘటక కాలసర్ప దోషం (10వ ఇల్లు - 4వ ఇల్లు)
స్థానం: రాజ్య స్థానం (10) నుండి చతుర్థ స్థానం (4) వరకు గ్రహాలు ఉంటే ఇది ఏర్పడుతుంది.
ఫలితాలు: ఉద్యోగంలో అస్థిరత, వ్యాపార సమస్యలు, పై అధికారులతో గొడవలు.
11. విషక్త (విషధర) కాలసర్ప దోషం (11వ ఇల్లు - 5వ ఇల్లు)
స్థానం: లాభ స్థానం (11) నుండి పంచమ స్థానం (5) వరకు గ్రహాలు ఉంటే ఇది ఏర్పడుతుంది.
ఫలితాలు: ఆర్థిక ఇబ్బందులు, వ్యాపారంలో లాభాలు రాకపోవడం, సోదరులతో విరోధం.
12. శేషనాగ కాలసర్ప దోషం (12వ ఇల్లు - 6వ ఇల్లు)
స్థానం: వ్యయ స్థానం (12) నుండి శత్రు స్థానం (6) వరకు గ్రహాలు ఉంటే ఇది ఏర్పడుతుంది.
ఫలితాలు: విపరీతమైన ఖర్చులు, కోర్టు కేసులు, శత్రు బాధలు.
(గమనిక: అపసవ్య కాలసర్ప దోషం ప్రత్యేకంగా 12వ ఇంట ప్రారంభమై 6వ ఇంట ముగిస్తే ఆలస్య వివాహం మరియు వైవాహిక జీవితంలో తీవ్ర ఇబ్బందులు కలుగుతాయి).
కుజ దోషం
జాతక చక్రంలో కుజుడు (Mars/Angaraka) లగ్నం నుండి 1, 2, 4, 7, 8 లేదా 12వ ఇళ్ళలో ఉన్నట్లయితే దానిని "కుజ దోషం" లేదా "మంగళ దోషం" అంటారు.
ముఖ్య గమనిక: కుజుడు ఉన్నంత మాత్రాన అది చెడు చేయదు. కుజుడి స్థానం, ఇతర గ్రహాల దృష్టిని బట్టి ఫలితాలు మారుతాయి. కానీ పైన పేర్కొన్న స్థానాల్లో ఉన్నప్పుడు వైవాహిక జీవితంపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంటుంది.
How to consider & Calculate :
కుజ దోషం యొక్క సాధారణ ప్రభావాలు
కుజ దోషం ఉన్నవారి జీవితంలో ప్రధానంగా మూడు రకాల సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది:
వివాహ ఆలస్యం: కుజ దోషం ఉన్నవారికి సరైన జోడీ దొరకకపోవడం లేదా సంబంధాలు కుదిరినట్టే కుదిరి చెడిపోవడం జరుగుతుంది. దీనివల్ల వివాహం ఆలస్యమవుతుంది.
వైవాహిక జీవితంలో గొడవలు: కుజుడు ఆవేశానికి, అధికారానికి కారకుడు. ఈ దోషం వల్ల భార్యాభర్తల మధ్య అపార్థాలు, ఆధిపత్య పోరు, గొడవలు జరగవచ్చు. తీవ్రమైన సందర్భాల్లో విడిపోయే ప్రమాదం కూడా ఉంటుంది.
ఆరోగ్య సమస్యలు: కుజుడు రక్తానికి, శక్తికి కారకుడు. దోషం ఉన్నవారికి రక్త సంబంధిత వ్యాధులు (Blood pressure), ఉష్ణ సంబంధిత సమస్యలు, లేదా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది.
వివిధ స్థానాల్లో కుజ దోష ఫలితాలు
కుజుడు ఏ ఇంట్లో ఉన్నాడు అనేదానిని బట్టి ఆ ప్రభావం మారుతుంది.
1. లగ్నంలో కుజుడు (1వ ఇల్లు)
ప్రభావం: లగ్నం అనేది వ్యక్తిత్వాన్ని, ఆరోగ్యాన్ని సూచిస్తుంది. ఇక్కడ కుజుడు ఉంటే ఆ వ్యక్తికి కోపం, ఆవేశం ఎక్కువగా ఉంటాయి.
వైవాహిక జీవితం: లగ్నంలో ఉన్న కుజుడు నేరుగా 7వ ఇంటిని (భార్య/భర్త స్థానం) చూస్తాడు. దీనివల్ల జీవిత భాగస్వామితో గొడవలు పడే అవకాశం ఉంది.
2. ద్వితీయంలో కుజుడు (2వ ఇల్లు)
ప్రభావం: ఇది కుటుంబం మరియు వాక్కు (మాట) స్థానం. ఇక్కడ కుజుడు ఉంటే మాట కఠినంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత ఉండదు.
వైవాహిక జీవితం: ఇది 7వ ఇంటికి (భాగస్వామికి) ఆయుష్షు స్థానం (8వ ఇల్లు) అవుతుంది. కాబట్టి భాగస్వామి ఆరోగ్యానికి లేదా కుటుంబ సౌఖ్యానికి ఇబ్బందులు కలుగుతాయి.
3. చతుర్థంలో కుజుడు (4వ ఇల్లు)
ప్రభావం: ఇది సుఖ స్థానం మరియు గృహ స్థానం. ఇక్కడ కుజుడు ఉంటే ఇంట్లో ప్రశాంతత లోపిస్తుంది.
వైవాహిక జీవితం: ఆస్తి తగాదాలు రావడం, వృత్తి ఉద్యోగాల్లో ఒత్తిడి కారణంగా ఇంట్లో ఆనందం లేకపోవడం జరుగుతుంది.
4. సప్తమంలో కుజుడు (7వ ఇల్లు)
ప్రభావం: ఇది వివాహ స్థానం. ఇక్కడ కుజుడు ఉండటం అత్యంత ప్రభావవంతమైన కుజ దోషం.
వైవాహిక జీవితం: భార్యాభర్తల మధ్య తీవ్రమైన అభిప్రాయ భేదాలు, శారీరక లేదా మానసిక హింస, మరియు ఇద్దరిలో ఒకరికి ఆధిపత్య ధోరణి ఉంటుంది.
5. అష్టమంలో కుజుడు (8వ ఇల్లు)
ప్రభావం: ఇది ఆయుష్షు మరియు మాంగల్య స్థానం. కుజ దోషంలో ఇది చాలా కఠినమైనదిగా పరిగణించబడుతుంది.
వైవాహిక జీవితం: జీవిత భాగస్వామికి ఆరోగ్య గండాలు, ఆర్థిక నష్టాలు, మరియు వైవాహిక బంధం తెగిపోయే ప్రమాదాలు సూచిస్తుంది.
6. వ్యయంలో కుజుడు (12వ ఇల్లు)
ప్రభావం: ఇది ఖర్చులు మరియు శయ్య సుఖాన్ని (Bed comforts) సూచిస్తుంది.
వైవాహిక జీవితం: దంపతుల మధ్య శారీరక సుఖం లేకపోవడం, అనవసరపు ఖర్చులు, నిద్రలేమి, రక్తపోటు (BP) వంటి సమస్యలు వస్తాయి.
గోచారం
Write : For example if you ordered a product from amazon, when it will transit and reach to you called gocharam, even a courier boy will reach your street even if he won't deliver if you have not ordered it.
శని ప్రభావం
జాతకాలను విశ్వసించేవారు ఇతర గ్రహాల గోచారం బాగోలేకపోయినా పెద్దగా భయపడరు కానీ, 'శని' (Saturn) విషయంలో మాత్రం ఆందోళన చెందుతారు. ముఖ్యంగా ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని నడుస్తున్నప్పుడు పరిస్థితులు కఠినంగా ఉంటాయని భావిస్తారు. శని కర్మ కారకుడు కాబట్టి, మనం చేసిన పనులకు ఫలితాలను ఇవ్వడంలో కఠినంగా ఉంటాడు. శని గోచారం వల్ల కలిగే వివిధ దశలు మరియు వాటి ఫలితాలు ఇక్కడ ఉన్నాయి
Saturn is the Karma Karaka. If we do hard work in the past, even this transit will produce positive results….
ఏలినాటి శని (Sade Sati)
జన్మ రాశి నుండి 12, 1, మరియు 2వ స్థానాల్లో శని సంచరించే కాలాన్ని 'ఏలినాటి శని' అంటారు. ఒక్కో రాశిలో రెండున్నర సంవత్సరాల చొప్పున, మొత్తం మూడు రాశుల్లో కలిపి ఏడున్నర సంవత్సరాలు (7 ½ Years) శని సంచరిస్తాడు. దీని ప్రభావం మూడు దశల్లో ఉంటుంది:
12వ స్థానంలో శని (వ్యయ శని): ఏలినాటి శనిలో ఇది మొదటి దశ. ఈ సమయంలో అనవసరమైన ఖర్చులు, వ్యవహారాల్లో చిక్కులు, వ్యాపారంలో ఒడిదుడుకులు, ఊహించని మార్పులు ఉంటాయి. కాళ్ళ నొప్పులు, తరచూ ప్రయాణాలు చేయడం వల్ల శారీరక శ్రమ పెరుగుతుంది.
1వ స్థానంలో శని (జన్మ శని): శని నేరుగా జన్మ రాశిలో సంచరించే కాలం ఇది. ఈ సమయంలో ఆరోగ్య భంగం, నిందలు పడటం (నీలాపనిందలు), భాగస్వాములతో వివాదాలు, మనశ్శాంతి లేకపోవడం జరుగుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో తీవ్రమైన ఒత్తిడి మరియు స్థానచలనం (Transfer/Change of place) ఉండే అవకాశం ఉంది.
2వ స్థానంలో శని (కుటుంబ/ధన శని): ఇది చివరి దశ. పనులు పూర్తవుతున్నట్టే అనిపించి చివరి నిమిషంలో ఆగిపోతాయి. శని ఆశ కల్పించి నిరాశపరుస్తాడు. ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధలు, కుటుంబంలో మాట పట్టింపులు మరియు మానసిక ఆందోళన ఎక్కువగా ఉంటుంది.
2. జీవితంలో శని పర్యాయాలు (Cycles of Saturn)
మనిషి జీవిత కాలంలో ఏలినాటి శని సాధారణంగా మూడుసార్లు వస్తుంది. ఒక్కో పర్యాయానికి ఒక్కో పేరు మరియు ఫలితం ఉంటుంది:
మొదటిసారి (మంగు శని): బాల్యంలో లేదా చిన్న వయసులో వచ్చే ఏలినాటి శనిని 'మంగు శని' అంటారు. ఇది విద్యా ఆటంకాలను లేదా ఆరోగ్య సమస్యలను ఇస్తుంది.
రెండవసారి (పొంగు శని): యవ్వనంలో లేదా మధ్య వయసులో వచ్చే దీనిని 'పొంగు శని' అంటారు. ఈ దశలో కష్టాలు ఉన్నప్పటికీ, శని వ్యక్తిని రాటుదేల్చి, వృత్తిపరంగా ఉన్నత స్థాయికి (Growth) తీసుకువెళతాడు. కష్టపడితే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి.
మూడవసారి (మృత్యు శని): వృద్ధాప్యంలో వచ్చే దీనిని 'మృత్యు శని' లేదా 'మరణ శని' అంటారు. ఈ దశలో ఆరోగ్యం పట్ల అత్యంత జాగ్రత్తగా ఉండాలి. అపమృత్యు భయం, శారీరక క్షీణత మరియు ప్రాణాపాయ స్థితులను సూచిస్తుంది.
3. ఇతర శని దోషాలు
ఏలినాటి శని కాకుండా, శని 4 మరియు 8వ స్థానాల్లో సంచరించడం కూడా సమస్యాత్మకమే.
అర్ధాష్టమ శని (4వ ఇంట శని): జన్మ రాశి నుండి 4వ స్థానంలో శని సంచారాన్ని 'అర్ధాష్టమ శని' అంటారు.
ఫలితాలు: గృహ సౌఖ్యం లోపిస్తుంది. స్థిరాస్తి సమస్యలు, రాజకీయ & వ్యాపార చిక్కులు, ఆకస్మిక బదిలీలు ఉంటాయి. ముఖ్యంగా తల్లి గారి ఆరోగ్యం దెబ్బతినడం, వాహన ప్రమాద సూచనలు మరియు కుటుంబంలో అశాంతి ఉంటుంది.
అష్టమ శని (8వ ఇంట శని): జన్మ రాశి నుండి 8వ స్థానంలో శని సంచారాన్ని 'అష్టమ శని' అంటారు. ఇది చాలా కష్టకాలంగా పరిగణించబడుతుంది.
ఫలితాలు: చేసే పనిలో ఆటంకాలు, ఉద్యోగ గండం, మరియు వ్యాపారంలో భారీ నష్టాలు రావచ్చు. బుద్ధి స్థిరంగా ఉండదు. తీవ్రమైన అనారోగ్య సమస్యలు, శత్రువుల వల్ల బాధలు, అవమానాలు మరియు ఊహించని నష్టాలు ఎదురవుతాయి.
Great transits of Saturn:
శనిని చూసి భయపడటం కంటే, క్రమశిక్షణతో ఉండటం, నీతిగా పని చేయడం మరియు పేదలకు సహాయం చేయడం వల్ల శని ప్రభావం నుండి ఉపశమనం పొందవచ్చు.
సాధారణంగా శని అనగానే అందరూ ఏలినాటి శని, అష్టమ శని గురించి భయపడతారు. కానీ, శని గోచారంలో కొన్ని స్థానాల్లో సంచరిస్తున్నప్పుడు అద్భుతమైన రాజయోగాన్ని, ధన లాభాలను ఇస్తాడు.
జన్మ రాశి (చంద్ర రాశి) నుండి శని 3, 6, మరియు 11వ స్థానాల్లో సంచరిస్తున్నప్పుడు అత్యంత శుభ ఫలితాలను ఇస్తాడు.
దీని పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి:
1. 3వ స్థానంలో శని (తృతీయ స్థానం - పరాక్రమం)
జన్మ రాశి నుండి 3వ ఇంట్లోకి శని వచ్చినప్పుడు జాతకుడికి ధైర్యం, ఉత్సాహం పెరుగుతాయి.
విజయం: చేపట్టిన పనులన్నీ విజయవంతం అవుతాయి. గతంలో ఆగిపోయిన పనులు మళ్ళీ మొదలవుతాయి.
ఆర్థికం: ఆదాయం గణనీయంగా పెరుగుతుంది.
సహకారం: స్నేహితులు, బంధువుల నుండి, ముఖ్యంగా తోబుట్టువుల నుండి సహాయ సహకారాలు అందుతాయి.
ఆరోగ్యం: ఆరోగ్యం కుదుటపడుతుంది. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు.
2. 6వ స్థానంలో శని (షష్టమ స్థానం - శత్రు జయం)
6వ ఇల్లు శత్రువులు, రోగాలు మరియు రుణాలకు సంబంధించినది. ఇక్కడ శని సంచారం చాలా మంచిది.
శత్రు నాశనం: మీ శత్రువులే మిత్రులుగా మారతారు లేదా శత్రువులపై మీరు విజయం సాధిస్తారు. కోర్టు కేసులు మీకు అనుకూలంగా మారుతాయి.
పోటీ పరీక్షలు: విద్యార్థులకు, నిరుద్యోగులకు ఇది గోల్డెన్ టైమ్. పోటీ పరీక్షల్లో విజయం సాధించి ప్రభుత్వ ఉద్యోగాలు పొందే అవకాశం ఉంటుంది.
ఆరోగ్యం: దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది.
భూ లాభం: స్థిరాస్తి లేదా భూమి కొనుగోలు చేసే యోగం ఉంటుంది.
3. 11వ స్థానంలో శని (ఏకాదశ స్థానం - లాభ స్థానం)
శని సంచారంలో కెల్లా అత్యంత అదృష్ట సమయం ఇదే. 11వ ఇల్లు లాభ స్థానం కాబట్టి శని ఇక్కడ కోరిన కోరికలన్నీ తీరుస్తాడు.
ధన వర్షం: ఊహించని మార్గాల ద్వారా ధనం వస్తుంది. వ్యాపారంలో విపరీతమైన లాభాలు ఉంటాయి.
ప్రమోషన్: ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, జీతం పెంపు (Salary Hike) కచ్చితంగా ఉంటాయి.
గౌరవం: సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. పెద్దల పరిచయాలు ఏర్పడతాయి.
శుభకార్యాలు: ఇంట్లో పెళ్లిళ్లు, గృహప్రవేశం వంటి శుభకార్యాలు జరుగుతాయి.
ముఖ్య గమనిక
శని ఈ 3, 6, 11 స్థానాల్లో ఉన్నప్పుడు కూడా మంచి ఫలితాలు పూర్తిగా పొందాలంటే:
నిజాయితీ: శని న్యాయానికి కారకుడు. కాబట్టి అక్రమ మార్గాల్లో వెళ్లకుండా నీతిగా పని చేయాలి.
కష్టపడే తత్వం: బద్ధకం లేకుండా కష్టపడితే శని రెట్టింపు ఫలితాలను ఇస్తాడు.
సేవ: పేదలకు, వికలాంగులకు సహాయం చేస్తే ఈ శుభ ఫలితాలు ఇంకా పెరుగుతాయి.
గురు సంచారం
జ్యోతిష్య శాస్త్రంలో 'గురువు' (Jupiter) శుభ గ్రహం. మన జీవితంలో జరిగే శుభకార్యాలు, ధనం, గౌరవం గురువు అనుగ్రహంపైనే ఆధారపడి ఉంటాయి. 'గురు సంచారం' మరియు 'గురు బలం' గురించి సరళమైన వివరణ ఇక్కడ ఉంది.
1. గురు సంచారం అంటే ఏమిటి?
గురు గ్రహం ఒక రాశి నుండి మరొక రాశికి మారడాన్ని "గురు సంచారం" లేదా "గురు గోచారం" అంటారు.
గురువు ఒక్కో రాశిలో సుమారు ఒక సంవత్సరం పాటు ఉంటాడు.
మొత్తం 12 రాశులు తిరగడానికి గురువుకు 12 సంవత్సరాలు పడుతుంది (దీనినే పుష్కర కాలం అంటారు).
ఈ సంచార సమయంలో గురువు ఏ రాశిలో ఉంటే ఆ రాశి వారికి, మరియు ఆ రాశి నుండి చూసే ఇతర రాశుల వారికి ఫలితాలు మారుతుంటాయి.
2. గురు బలం అంటే ఏమిటి? (Guru Balam)
మన జన్మ రాశి (చంద్ర రాశి) నుండి, గోచారంలో గురువు ఉన్న స్థానాన్ని బట్టి "గురు బలం" ఉందా లేదా అని నిర్ణయిస్తారు. ముఖ్యంగా వివాహ ప్రయత్నాలు చేసేవారికి గురు బలం చాలా ముఖ్యం.
గురు బలం ఎప్పుడు ఉంటుంది?
గోచార రీత్యా గురువు మీ జన్మ రాశి నుండి 2, 5, 7, 9, 11 (10 - verify it) వ స్థానాల్లో సంచరిస్తున్నప్పుడు మీకు "గురు బలం" ఉన్నట్లు లెక్క.
గురు బలం ఎప్పుడు ఉండదు?
గురువు మీ రాశి నుండి 1, 3, 4, 6, 8, 12 వ స్థానాల్లో సంచరిస్తున్నప్పుడు గురు బలం తక్కువగా ఉంటుంది.
3. ఫలితాలు ఎలా ఉంటాయి?
గురు బలం ఉన్నప్పుడు (శుభ ఫలితాలు):
గురువు 2, 5, 7, 9, 11 స్థానాల్లో ఉంటే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి:
వివాహ యోగం: పెళ్లి కాని వారికి సంబంధాలు కుదురుతాయి. పెళ్లి పీటలు ఎక్కుతారు.
ఆర్థిక లాభం: చేతిలో డబ్బు నిలుస్తుంది, అప్పులు తీరుతాయి.
సంతానం: సంతాన ప్రయత్నాలు ఫలించి, పిల్లలు కలుగుతారు.
గౌరవం: సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఉద్యోగంలో ప్రమోషన్లు వస్తాయి.
దైవ చింతన: పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు, మనస్సు ప్రశాంతంగా ఉంటుంది.
గురు బలం లేనప్పుడు (ప్రతికూల ఫలితాలు):
గురువు అనుకూల స్థానాల్లో లేనప్పుడు కొన్ని ఇబ్బందులు ఉంటాయి:
1వ ఇంట (జన్మ గురువు): స్థాన చలనం, దూర ప్రయాణాలు, ఆరోగ్య సమస్యలు, మనశ్శాంతి ఉండదు. "జన్మ గురువు శివుడికైనా కష్టమే" అంటారు.
3వ ఇంట: సోదరులతో గొడవలు, చేసే పనిలో ఆటంకాలు.
4/10వ ఇంట: ఉద్యోగంలో ఒత్తిడి, తల్లిగారికి అనారోగ్యం, పనిభారం ఎక్కువ.
8వ ఇంట (అష్టమ గురువు): ఇది చాలా కష్టకాలం. అవమానాలు, ఆర్థిక నష్టాలు, ఎవరూ సాయం చేయకపోవడం.
12వ ఇంట: శుభకార్యాలకే అయినప్పటికీ విపరీతమైన ఖర్చులు ఉంటాయి.
గురు బలం అనేది మనకు వచ్చే అవకాశాలను సూచిస్తుంది. బలం ఉన్నప్పుడు ప్రయత్నిస్తే పనులు వేగంగా అవుతాయి, లేనప్పుడు కొంచెం ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది అంతే. దైవబలం ఉంటే ఏ గ్రహ బలమైనా సానుకూలం అవుతుంది.
ముగింపు
గ్రహాలు కేవలం సూచికలు మాత్రమే, శిక్షకులు కాదు. మన ఆలోచన మంచిదైతే, మన ఆచరణ స్వచ్ఛంగా ఉంటే... ఏ గ్రహ దోషం మన ప్రగతిని అడ్డుకోలేదు. కష్టపడి పని చేయడం, 'మానవత్వం'. తల్లిదండ్రులని గౌరవించడం, ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం, తోటివారికి హాని చేయకుండా ఉండడం... వీటిని మించిన శాంతి పూజలు ఈ ప్రపంచంలో లేవు.