Karma, Remedies & Their Spiritual Logic
కర్మ సిద్ధాంతం, పరిహారాలు మరియు వాటి ఆధ్యాత్మిక తర్కం
Understanding Karma Theory, Remedies, and the Spiritual Logic behind them
ఉపోద్ఘాతం
జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు జ్యోతిష్యులు చెప్పే పరిహారాలతో మనం నిజంగా ఆ సమస్య నుంచి బయట పడతామా, నిజంగా పరిహారాలు పనిచేస్తాయా, మనం చేసే పరిహారం సరైనదేనా, సరైన పద్ధతిలో చేస్తున్నామా, నిజంగా పరిహారాలు అవసరమా, భక్తి, దైవం జీవితాన్ని మార్చేస్తాయా. ఇలాంటి అనేక ప్రశ్నలకు జ్యోతిష్యం ద్వారా సమాధానం దొరికే అవకాశం ఉంది.
(నేను చెప్పే ప్రతి విషయం నా అనుభవం నుంచి నా పరిశీలన నుంచి చెప్పే ప్రయత్నం చేస్తాను, నేను కుల మతాలకు అతీతంగానే ఆలోచించి చెప్పే ప్రయత్నం చేస్తాను)
పద్మనాభసింహ "ఇది నా ప్రపంచం" (Baadshah 2013 Movie), ఇవన్నీ నాకు అర్థమైన విషయాలు మాత్రమే, నా ప్రపంచంలో మీరు తప్పులు వెతకడానికి వీల్లేదు. :)
పరిహారాలు
తెలిసో తెలియకో చేసిన తప్పుకు చేసే ప్రాయశ్చిత్తమే పరిహారం. (అది ఈ జన్మలో అయినా, పూర్వ జన్మలో అయినా)
సమస్య ఆధారంగా గురువుల (వేదం లేక పురాణం ఆధారంగా) చేత లేక పెద్దవారి చేత ఇలాంటి పరిహారం లేదా ప్రక్రియ చేయమని మనకి సలహా ఇస్తూ ఉంటారు, నిజానికి అవి కొంతమందికి పని చేశాయని కొంతమందికి పని చేయలేదని చెప్తూ ఉంటారు దీనికి గల పూర్తి కారణాలను మనం తెలుసుకోవాలి.
పూర్వజన్మ కర్మ
హైందవ సంప్రదాయం, భారతదేశంలో చాలా మంది పూర్వజన్మను పూర్వజన్మ కర్మను కచ్చితంగా నమ్ముతారు, అనేక పురాణాల ఆధారంగా, నాకు కలిగిన అనుభవం ఆధారంగా అది నిజమే అని నమ్మాల్సి వస్తుంది.
నాకు తెలిసినంతవరకు జీవి అనేకసార్లు జన్మించడం మరణించడం జరుగుతుంది, ఆత్మ నశించినది, ఒక్కోసారి మనిషిగానో, జంతువు గానో, కీటకంగానో, జల చారలుగానో కర్మను అనుసరించి ఎలాగైనా పుట్టవచ్చు. అయితే మళ్లీ పుట్టినప్పుడు ఈ జీవితంలో ఏమీ అనుభవించాలి అనేది పూర్వకర్మ ఆధారంగా నిర్దేశించబడుతుంది.
కర్మ సిద్ధాంతం
ఒక ముక్కలో చెప్పాలంటే ఎవరినైనా లాగిపెట్టి గట్టిగా కొడితే తిరిగి కచ్చితంగా కొడతాడు లేదంటే ఏదో ఒక రకమైన వ్యతిరేక భావనను తెలియజేస్తాడు. ఇలా వ్యక్తి తెలియజేసే వ్యతిరేక బావనే చేసిన కర్మకు ప్రతి కర్మ చేరుకోవడం. కర్మ అంటే పని అని అర్థం, ఇది మంచి చెడు ఏదైనా.
దృఢకర్మ (Fixed Karma)
ఒక విషయాన్ని జీవితంలో కచ్చితంగా అనుభవించాల్సింది ఉంటే అది దృఢకర్మ అంటారు. ఇది మార్చడానికి వీలు కాదు.
అదృఢకర్మ (Modifiable Karma)
కొన్ని విషయాలు మానవ ప్రయత్నంతో మనకుగా మనం మార్చుకునే అవకాశం ఉంటే అది అదృఢ కర్మ అవుతుంది.
కర్మ - Free Will
కొన్ని విషయాలు పూర్తిగా మన చేతుల్లో ఉంటాయి, ఉదాహరణకు మనం సినిమాకి వెళ్లాలనుకుంటే వెళ్ళొచ్చు లేదంటే మానేయొచ్చు.
హైందవ ధర్మ పరిహారాలు & రాశి చక్రం
జ్యోతిష్యులు అందరూ రాశి చక్రం ఆధారంగానే పరిహారాలు తెలియజేస్తారు. 360 డిగ్రీల ఈ రాశి చక్రాన్ని 12 భాగాలు చేశారు, 27 నక్షత్రాలు ఈ రాశుల మీద ఒక రోడ్డు లాగా నిర్మించబడ్డాయి. రాశులు నక్షత్రాలు స్థిరమైనవి ఇది కదలవు, వీటి మీద నవగ్రహాలు సంచరిస్తూ ఉంటాయి.
జన్మ సమయంలో ఉన్న గ్రహస్థితి ఆధారంగా, కొన్ని సందర్భాల్లో జరుగుతున్న దశాబుక్తి ఆధారంగా జ్యోతిష్యులు పరిహారాల్ని సూచించే ప్రయత్నం చేస్తారు.
నాలుగు రకాల రాశులు పంచభూతాల తత్వాన్ని కలిగి ఉంటాయి.
గ్రహ శాంతి
సహజంగా గ్రహాలకు శాంతి చేయడం కోసం ఈ విధమైన ప్రక్రియను అనుసరిస్తారు.
జపం — వాయు తత్వం
మంత్ర జపం ద్వారా వాయు తత్వం సంబంధిత గ్రహ శాంతి చేయడం.
దేవాలయ దర్శనం, దానం — భూతత్వం
భూతత్వం సంబంధిత గ్రహ శాంతికి దేవాలయ దర్శనం మరియు దానం చేయడం.
హోమం — అగ్ని తత్వం
హవ్యములతో అగ్ని తత్వం ద్వారా గ్రహ శాంతి ప్రక్రియ.
తర్పణం — జలతత్వం
జలతత్వం ద్వారా గ్రహ శాంతికి తర్పణం చేయడం.
శని గ్రహ శాంతి Saturn Example
శని గ్రహ శాంతికి దశ 19 సంవత్సరాలు గనుక 19,000 జపం చేసి, దానిలో 10% అంటే 1,900 సార్లు శని మూల మంత్రంతో హవ్యములతో హోమం చేస్తారు, మళ్లీ దానిలో 10% అంటే 190 శనికిష్టమైన నువ్వుల ఉండలని నీటిలో జలచరాల కోసం తర్పణం చేస్తారు. అన్ని అయ్యాక 19 మంది బ్రాహ్మణులకు అన్నదానం వస్త్ర రజిత ఇలా శక్తి కొద్దీ దానం చేస్తారు.
పరిహార ప్రక్రియ ఎంతవరకు సరిగ్గా జరిగిందనే దానికి రుజువు
- శని నీలం రంగుకి సూచన కావున పూజ ప్రక్రియ మొత్తం పూర్తయ్యాక మనకి నీలం రంగులో ఏదైనా గొప్పగా కనిపించవచ్చు, శని కుంటివాడు గనుక అలాంటి వ్యక్తి ఎవరైనా వచ్చి మనతో మంచిగా మాట్లాడవచ్చు.
- మరోసారి జ్యోతిష్యుణ్ణి కలిస్తే ప్రశ్న కుండలి ద్వారా ఒకటి ఐదు తొమ్మిది కోన స్థానాలను పరిశీలించి ఏమాత్రం అది గొప్పగా జరిగిందో తెలుసుకోవచ్చు.
పరిహారాలు ఒకరి కోసం చేయడం
నాకు తెలిసినంతవరకు భార్య చేసింది భర్తకు, తల్లి చేసింది పిల్లలకు కొంతవరకు చెందుతూ ఉంటుంది. కుటుంబ సభ్యులు, రుణానుబంద రూపేనా ఏర్పడతారు కనుక ఎవరి కోసం ఎవరైనా చేయవచ్చు. ఎంత చేసినా కొంత శాతం మాత్రమే వెళుతుంది, కాబట్టి ఎవరిది వాళ్లే చేయడం ఉత్తమం.
ఉదాహరణకు నాకు ఆకలిగా ఉంటే వేరే వాళ్ళు తింటే నా ఆకలి తీరదు.
పరిహార ప్రక్రియ శాస్త్రీయ దృక్పథం
జపం (Chanting)
మానసిక నిశ్చలత, ఏకాగ్రత కలుగుతాయి. అన్ని విషయాలు నిదానంగా ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోగలరు. మంత్ర బీజాక్షరాలకు, శబ్ద శాస్త్రానికి ఉన్న శక్తి అది.
హోమం (Fire Ritual)
హోమంలో వాడే హవ్యాల వలన వాటిని పీల్చి ఆరోగ్యము మెరుగుపడుతుంది.
దానం & తర్పణం (Charity & Offering)
ఏది ఆశించకుండా ఇతరులకు సహాయం చేయడం వలన తెలియని మానసిక సంతృప్తి కలుగుతుంది.
దేవాలయ దర్శనం (Temple Visit)
ఇది ఒక అయస్కాంత క్షేత్రం, మానసికంగా ఆధ్యాత్మికంగా సరైన ఆలోచనలకు ప్రశాంతతకు మూల కారణమవుతుంది.
పరిహారాలు పనిచేయలేదు — ఎందుకు?
మన పూర్వ పుణ్యాన్ని కిలోల్లోనూ మరి ఏ విధంగానో కొలవలేము కాబట్టి మనకు నిజానికి ఏమాత్రం అయినా పూర్వపుణ్యం ఉందో తెలియదు. మనం కోరుకునే విషయం మనకు మంచో చెడో కూడా తెలియదు. కాబట్టి కొన్ని సందర్భాల్లో మనం కోరే కోరికకు తగిన పూర్వపుణ్యం లేనప్పుడు మనకు ఈ పరిహార ప్రక్రియలు ఫలించినట్టు ఫలితం కనబడదు.
పూర్వపుణ్యాన్ని భాగ్య స్థానం నుంచి, భాగ్యాధిపతి నుంచి మరియు దశ నాథుడు ఏ విధంగా సంబంధాన్ని కలిగి ఉన్నాడో పరిశీలించాలి.
పూర్వ పుణ్యము ఎలా పెంచుకోవాలి
పూర్వ పుణ్యం అనేది ఎక్కడినుంచో గాల్లో వచ్చింది కాదు, పూర్వజన్మ యందు మన కష్టాన్ని మనం పూర్తిగా వాడుకోకుండా మిగిలించి ఉన్నది.
నేనొక రెండు నెలలు ఉద్యోగం చేసి ఒక లక్ష దాచాను. వేసవి సెలవుకి కులుమనాలి విహారయాత్రకు వెళ్లాను. ఇక్కడ దాచాను కాబట్టి వాటిని వాడుకోవడానికి వెసులుబాటు ఉంది, లేకపోతే అక్కడే సంపాదించి అక్కడే వాడుకోవాల్సి ఉంటుంది.
మనకు డబ్బులు ఉంటే ATM, UPI, cheque, బ్యాంకుకు వెళ్లి ఇలా ఏదో ఒక మార్గం ద్వారా మన డబ్బులు తిరిగి పొందుతాం. ఇక్కడ డబ్బులు అంటే మన శక్తిని, కష్టాన్ని తర్జుమా చేస్తే వచ్చిన రూపం అంతే.
దేవుడు ఒక పెద్ద లెక్క ఉన్నోడు
ఈ జీవితంలో చేసిన కష్టాన్ని మనం డబ్బు రూపంలో దాచుకుంటున్నాం. మనకి తెలియని జన్మజన్మల కష్టాన్ని పూర్వపుణ్యంగా చెప్పవచ్చు.
అంటే పూర్వపుణ్యమంటే గాల్లోంచి వచ్చింది కాదు అది కూడా మన కష్టమే. కాకపోతే అది జన్మంతరంగా మనకు తెలియకుండా మనం పొందుతున్నాం.
దేవుడి నెట్వర్క్ — పంచభూతాలు
మన పూర్వ పుణ్యాలను పాపాలను ఆ దేవుడు దాచి పెడుతున్నాడు అనుకున్నాం. ఈ అన్ని లెక్కలను దాస్తున్నాడు కాబట్టి కొంచెం సేపు ఆయనను ఒక బ్యాంక్ అధికారి అనుకుందాం.
మరి చాలామంది చాలా పనులు చేసుకుంటారు కదా, మనం చేసేది పాపం అని ఎలా తెలుస్తుంది అంటే, ఆయనకంటూ సొంత నెట్వర్క్ ఉంది.
ఈ ఐదు పంచభూతాలకు తెలియకుండా ఏ జీవి ఏమి చేయలేడు, ఒకవేళ చేశాడు అంటే వాడు ఈ లోకంలో లేనట్టే.
ఉదాహరణకు ఓ పిల్లోడు బాగా దాహంగా ఉంది అని మంచినీళ్లు తాగుతుంటే నువ్వు గబాలున లాక్కుని వాడికి మిగిల్చకుండా తాగేసేవనుకో అది ఒక చిన్న తప్పు. ఇప్పుడు నీరు అనే పంచభూతం వెళ్లి దేవుడికి ఒక పెద్ద డాటా బేస్ లో అప్డేట్ చేస్తది.
నేటికి సంబంధించిన రెండు గ్రహాలు చంద్ర శుక్రులు రాబోయే జన్మలో ఈ విషయాన్ని తిరిగి అనుభవించే విధంగా ఈ రిపోర్ట్ ఆధారంగా ఆగ్రహ స్థితిలో మనం పుట్టేటట్టు పరిస్థితి ఏర్పడుతుంది.
జీవి చేసే మంచి చెడు పనులు
దేవుడి దగ్గర మంచి చెడుకి రెండు వేరువేరుగా Database ఉన్నాయి, మంచి చేస్తే మంచి లోను చెడు చేస్తే చెడులోనూ ఈ రిపోర్ట్ అప్డేట్ అవుతూ ఉంటుంది. కాబట్టి తిరిగి ప్రతి జీవి కర్మ ఆధారంగా మంచి చెడును కచ్చితంగా అనుభవించాలి. మొత్తంగా జీవితాన్ని చూసుకుంటే మంచి ఎక్కువగా ఉంటే అంతా బాగున్నట్టు మనం అర్థంచేసుకోవాలి అంతే.
పరిహారాలు, పూజలు, భక్తి & దేవుడు
మనం చేసే ఏ పరిహారాలు పూజలు దేవుని ఆనందింప చేయవు, బాధ పెట్టవు, మనం అనుకునే వీటన్నిటికీ ఆయన చాలా అతీతుడు.
మీరు ఒక చిన్న కోరికను (ఒక మంచి ఆపిల్ తినాలని అనుకున్నారు) ఈ విషయం చాలా సునాయాసంగా నెరవేరుతుంది. దీనికోసం మనం ఎన్నడు దేవుని తలుచుకోము, ఎందుకంటే ఇది మన చేతుల్లోనే ఉంది అని.
ఒక ఇల్లు, కారో కొనాలనుకున్నప్పుడు, సామాన్య వ్యక్తికి ఇది కొంచెం పెద్ద విషయం అప్పుడు బ్యాంకు కు వెళ్లడం అంటే, ఒక పెద్ద పుణ్యక్షేత్రాన్ని దర్శించి ఏ అడ్డంకులు రాకుండా చూసుకోమని చెప్పడం. మన పూర్వ పుణ్యముంటే అనుగ్రహం దొరుకుతుంది.
ఒక్కోసారి చిన్న పనులు కూడా జీవితంలో ముందుకు వెళ్లవు, అప్పుడు మనం గ్రహ శాంతులు, కులదైవం, జప తప, హోమ, తర్పణ, క్షేత్ర దర్శనం వంటివి ఆచరించి ప్రయత్నం చేస్తాం. ఒకవేళ పూర్వ పుణ్యం ఉంటే అవి ఫలించవచ్చు.
గ్రహాలు — బ్యాంకు సెక్యూరిటీ గార్డ్
ఒక్కోసారి నాకు ఒక ఆలోచన వస్తూ ఉంటుంది మనం చేసే పూజలన్నీ గ్రహాలకి లంచం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నామని? ఒక పెద్ద బ్యాంకులో సెక్యూరిటీ గార్డ్ కి ఆయనకు నచ్చినవన్నీ చేసి, ఆయన సంతోషపెట్టి, మనకు నచ్చినంత నగదు ఆ బ్యాంకులో నుంచి తెచ్చుకోవచ్చా?
ఏ దేవుడికైనా, యే గ్రహానికైనా, పూజ, పరిహారం, వ్రతం ఏది చేసినా నీకు పూర్వ పుణ్యము ఉంటే అది జరుగుతుంది, ఈ పద్ధతులన్నీ నీ పూర్వపుణ్యాన్ని వాడుకోవడానికి ఉన్న మార్గాలు అని గ్రహించాలి.
పరిహారాలు — ఔషధం — అలవాటు
పరిహారం అనేది ఒక అలవాటు అవ్వాలి, అంతేగాని సమస్య వచ్చినప్పుడు హోమం చేస్తాను, 10 మందికి దానం చేస్తాను అంటే సరైన పద్ధతి కాదు.
ఏదైనా ఒక విషయానికి పరిహారం చేస్తున్నవంటేనే మళ్లీ తిరిగి అలాంటి తప్పు జీవితంలో చేయకూడదు. గ్రహ దోషాలు, జీవితంలోని పరిస్థితులు రావడానికి ఎవరు కారణం కాదు, స్వయంగా మనమే కారణం. జాతక చక్రం అనేది ఒక కారు నడుపుతున్నప్పుడు ఒక స్పీడోమీటర్ లాంటిది మాత్రమే.
కాలం తిరిగి రానిది
ప్రతి వ్యక్తి తన గుర్తింపు తను చేసే పని వల్లే వస్తుంది, అదే దశమ కర్మ స్థానం, కాబట్టి తను చేసే పని తన చేతిలో ఉన్న పని కచ్చితంగా తన శక్తి కొద్దీ పూర్తిగా చేయవలసింది.
ఎందుకంటే ఒక సందర్భంలో చేసిన ఒక విషయాన్ని తిరిగి మార్చడానికి కాలంలో వెనక్కి ప్రయాణించలేం కనుక, చేసేటప్పుడే సరిగా చేస్తే జీవితంలో ఆ విషయం పట్ల ఎటువంటి విచారం మళ్లీ కలగదు.
సంస్కృతి — శోడశోపచార పూజలు
ముఖ్యంగా మనం చేసే శోడశోపచార పూజలలో మనం చేసేది, దేవుని ముందుగా రమ్మని, ఆసనం మీద కూర్చొని, మంత్ర జపంతో భక్తితో ఆరాధించి, కాళ్లు చేతులు మొహం అన్ని శుభ్రం చేసుకోమని, తరువాత ప్రసాదం తినమని, తర్వాత మళ్లీ కాళ్లు చేతులు మొహం కడుక్కోమని, తాంబూలం తీసుకోమని, తిరిగి యధా స్థానానికి చేరుకోమని శాస్త్రోక్తంగా సాగనంపుతాం.
ఇక్కడినుంచి ఇతర జీవి పట్ల, తల్లిదండ్రులకు గాని, సేవ అనేది జీవితంలో ఉండే అలవాటుగా తెలియజేస్తుంది.
సరస్వతి లక్ష్మీ పార్వతి
సరస్వతి — విద్య
బ్రహ్మ జీవులను పుట్టిస్తే, మనిషి పుట్టాక మనుగడకు ఏదో ఒక విద్యను నేర్చుకోవాలి.
లక్ష్మి — సంపద
మహావిష్ణువు పోషణ కారకుడు అయితే, ప్రతి జీవి పొట్టకూటికోసం కష్టపడాలి, తినగా మిగిలిన కష్టాన్ని మనం డబ్బు రూపంలో దాచుకుంటున్నది అదే శ్రీ మహాలక్ష్మి.
పార్వతి — ఆహారం & మోక్షం
కష్టంతోనే మనం ఆహారాన్ని పొందుతున్నాం అదే అన్నపూర్ణ అనుగ్రహం, చివరికి శివైక్యం చెందుతున్నాం.
Master CVV : Split కర్మ
మాస్టర్ సి.వి.వి గారు శివ స్వరూపంగా, సాక్షాత్తు దైవ స్వరూపంగా పరిగణిస్తారు, ఇక్కడ మనం ఆయన చెప్పిన కర్మ సిద్ధాంతాన్ని అర్థం చేసుకుంటే చాలు.
Split Karma — సేవ ద్వారా Service Path
ఒక వ్యక్తి జాతకంలో తల్లికి ఆరోగ్యం బాగోదు, జాతకుడు ఆ కర్మను అనుభవించవలసి ఉంది. తల్లి అంటే సొంత తల్లి అయినా మరి ఏ తల్లి అయినా తల్లితో సమానమే. కాబట్టి శని ఆదివారాల్లో వృద్ధాశ్రమానికి వెళ్లి తల్లి సమానురాలకి సేవ చేస్తూ ఉండవచ్చు.
ఇలా చేస్తే కర్మ ప్రకారం పెద్దగా జరగాల్సిన విషయం చిన్నగా జరగొచ్చు. (గొడ్డలితో పోయేది గోటితో పోవచ్చు)
ఆశించి చేసే పరిహారాలు Expectation
వ్యాపారం లాగా చేసే పరిహారాలు ఏవి పనిచేయవు. "నేను వంద రూపాయలు పెట్టాను కాబట్టి 20 రూపాయల లాభం కావాలి", "లక్ష రూపాయలు పెట్టి హోమం చేశాను కాబట్టి అయిపోవాలి" — ఇలాంటివి ఎన్నడు జరగవు. కర్మ సిద్ధాంతాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలి.
గురువుల చేత పరిహారాలు Guru's Grace
మనకున్న పూర్వకర్మ ఆధారంగా కొంతమంది జీవితాల్లో విశేషమైన సిద్ధులు గురువులు తారసపడుతుంటారు, వాళ్ళు చెప్పింది చిన్న విషయమైనా అది తారక మంత్రం లాంటిది. అదే గౌరవంతో దాన్ని పాటిస్తే ఖచ్చితంగా అనుకున్నది జరుగుతూంటుంది. అందుకే గురువులు ఎవరికి పడితే వారికి ఉపదేశాలు చెప్పరు, దేనికైనా ఒక అర్హత కూడా ఉండవలసి వస్తుంది.
లైఫ్ స్టైల్ పరిహారాలు
మనిషి సంఘజీవి గనుక మనుషులతోనే బతుకుతాడు కనుక, పరిహారం అనేది ఒక ఔషధం లాగా కాకుండా ఒక అలవాటుగా మారిపోవాలి అదే సరైన మార్గం.
కర్మ వల్ల ఫలితం వస్తుంది గాని గ్రహాల వల్ల మరో ఇతర శక్తుల వల్ల రావడం లేదు, అంటే మనం సత్కర్మలు చేయాలని అర్థం చేసుకోవాలి.
పంచభూతాలు — కాలం
కనిపించేవి పంచభూతాలైతే, కనిపించనిదే కాలం, అది విలువైనది. ఏ విధంగా వృధా చేసిన, సరైన విధంగా వాడుకోకపోయినా మనం చేసే దాన్ని బట్టి దాని తీవ్రత ప్రకృతి తిరిగి మనకు ఇస్తూ ఉంటుంది.
జాతక చక్రంలో లైఫ్ స్టైల్ రెమిడి Birth Chart
చతుర్ధ భావము, అధిపతి, మాతృ కారకుడు చంద్రుడు, జల రాశుల్లో పాప గ్రహాల చేత ఏర్పడిన బలహీనమైన గ్రహస్థితి ఉన్నప్పుడు, స్త్రీలను, తల్లిని గౌరవించడం నేర్చుకోవాలి, వారికి సంబంధించి సేవను చేయవలసి ఉంటుంది, అలాగే నీటిని వృధా చేయకూడదు, లేనివారికి అవకాశం కొద్దిగా సహాయం చేయవచ్చు.
ముగింపు
మనిషి సంఘజీవి, మనుషులతోనే బతుకుతుంటాడు, కాబట్టి మానవత్వాన్ని మర్చిపోకూడదు. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందని, ఏ వ్యక్తి అయినా ఎప్పుడో అప్పుడు ఉపయోగపడతాడని, వారి యందు కృతజ్ఞతలు మర్చిపోకూడదు.
ప్రకృతిలో మనం ఏదిస్తే అదే తిరిగి వస్తుంది, మంచి ఇస్తే వస్తుంది చెడిస్తే చెడు తిరిగి వస్తుంది. మనం ఏ పరిహారం చేసిన అది ఇతర జీవికి ఎలా ఉపయోగపడుతుందో కూడా చూడాలి, ప్రకృతిని పంచభూతాల్ని రక్షించాలి.
Introduction
When problems arise in life, can we truly overcome them through the remedies suggested by astrologers? Do remedies really work? Is the remedy we are performing the right one? Are we doing it the correct way? Are remedies even necessary? Can devotion and God truly transform our lives? There is a possibility of finding answers to all such questions through astrology.
(Everything I share comes from my own experience and observation, and I try to think and speak beyond the boundaries of caste and religion.)
Padmanabha Simha — "This is my world" (Baadshah 2013 Movie). These are only things as I understand them; you are not allowed to find faults in my world. :)
Remedies
A remedy is the atonement performed for mistakes committed knowingly or unknowingly — whether in this birth or in a previous birth.
Based on the problem, gurus guided by the Vedas or Puranas, or elders, advise us to perform certain remedies or rituals. In reality, some people say these worked for them while others say they did not. We must understand the complete reasons behind this.
Previous Birth Karma
In the Hindu tradition, many people in India firmly believe in previous births and the karma of previous births. Based on numerous Puranas and my own experience, one is compelled to believe that it is true.
As far as I know, a living being is born and dies many times. The soul is imperishable. Sometimes one may be born as a human, an animal, an insect, or an aquatic creature — it depends on one's karma. What one must experience in this life is determined based on previous karma.
Karma Theory
In simple terms, if you pull someone and hit them hard, they will certainly hit back, or at the very least express some form of adverse reaction. This adverse reaction is the counter-karma reaching back for the karma performed. Karma means action — whether good or bad.
Fixed Karma (drudha karma)
When something must be experienced in life without fail, it is called Fixed Karma. This cannot be changed.
Modifiable Karma (adrudha karma)
When certain things can be changed through human effort, that becomes Modifiable Karma.
Free Will Karma
Some things are entirely in our hands. For example, if we want to go to a movie, we can go, or we can choose not to.
Hindu Remedies & The Zodiac Chart
All astrologers suggest remedies based on the zodiac chart. This 360-degree zodiac chart is divided into 12 parts, and 27 stars are laid upon these signs like a road. The signs and stars are fixed and do not move; the nine planets transit over them.
Based on the planetary positions at the time of birth, and in some cases based on the ongoing planetary period, astrologers attempt to suggest remedies.
Four types of signs carry the nature of the five elements.
Planetary Pacification
Typically, the following practices are followed to pacify the planets.
Chanting (Japam) — Air Element
Planetary pacification through mantra chanting, related to the air element.
Temple Visit & Charity (Danam) — Earth Element
Planetary pacification through temple visits and charitable giving, related to the earth element.
Fire Ritual (Homam) — Fire Element
Planetary pacification through fire ritual with offerings, related to the fire element.
Water Offering (Tarpanam) — Water Element
Planetary pacification through water offering, related to the water element.
Saturn Pacification Saturn Example
For Saturn planetary pacification, since Saturn's planetary period is 19 years, 19,000 chants are performed. From that, 10% (1,900 times) a fire ritual is performed with Saturn's root mantra. Again, 10% of that (190 times) sesame balls are offered as water oblations. After everything is completed, food, clothing, and silver are donated to 19 Brahmins according to one's capacity.
Proof of Remedy Effectiveness
- Since Saturn signifies blue color, after the entire worship process, something magnificent in blue color may appear. Since Saturn is associated with lameness, a person with such a condition may come and speak kindly.
- By examining the 1st, 5th, and 9th trine houses through a Prashna chart, one can determine how effectively the remedy was performed.
Performing Remedies on Behalf of Others
What a wife performs reaches the husband to some extent, and what a mother performs reaches the children to some extent. Since family members are formed through karmic bonds, anyone can perform remedies for anyone. However, only a certain percentage reaches the intended person, so it is best for each person to perform their own remedies.
For example, if I am hungry, my hunger will not be satisfied if someone else eats.
Scientific Perspective of the Remedy Process
Chanting (Japam)
It brings mental stability and concentration. One can think through all matters calmly and make the right decisions. This is the power of mantra seed syllables and the science of sound.
Fire Ritual (Homam)
By inhaling the offerings used in the fire ritual, health improves.
Charity & Water Offering
Helping others without any expectation brings an inexplicable inner satisfaction.
Temple Visit
It is a magnetic field. It becomes the root cause for right thoughts and peace, both mentally and spiritually.
Why Remedies Don't Work Sometimes
Since we cannot measure our previous life merit in kilograms or any other way, we truly do not know how much merit we actually have, nor do we know to what extent it can help overcome current problems. We do not even know whether what we desire is good or bad for us. Therefore, in some cases, when we do not have sufficient past merit, these remedy processes will not appear to yield results.
Previous life merit should be examined through the 9th house of fortune, the lord of the 9th house, and how the planetary period lord is connected to them.
How to Accumulate Previous Life Merit
Previous life merit did not come from thin air. It is the hard work from our previous birth that we did not fully use up and left as a balance.
Suppose I worked for two months and saved one lakh rupees. I went on a vacation to Kullu Manali. Because I saved it, I have the flexibility to use it. Otherwise, I would have to earn and spend at the same place, which is not easy.
If we have money, we retrieve it through ATM, UPI, cheque, or by visiting the bank. Here, money is simply the translated form of our energy and hard work — nothing more.
God is a Great Accountant
In this life, we save our hard work in the form of money. The hard work of unknown past lifetimes can be called previous life merit.
So now everyone understands — previous life merit did not come from thin air; it is also our own hard work. The only difference is that we receive it across lifetimes without our conscious knowledge.
God's Network — The Five Elements
Let us assume that God stores our previous merits and sins. Since He stores all these accounts, let us think of Him as a bank officer for a moment.
Many people do many things. How does God know what we do is sinful? He has His own network.
No living being can do anything without the knowledge of these five elements. If someone could, it means they do not exist in this world.
For example, suppose a child is very thirsty and is drinking water, and you suddenly snatch it away and drink it all without leaving any for the child — that is a small wrongdoing. Now the element of water goes and updates this in God's great database.
The two planets associated with water — Moon and Venus — based on this report, create a situation where we are born in a future life with planetary positions that make us experience this matter again.
Good and Bad Deeds
God maintains two separate databases for good and bad. If you do good, the report updates in the good database; if you do bad, it updates in the bad one. Therefore, every living being must inevitably experience both good and bad based on their karma. Overall, if the good outweighs the bad, we should understand that things are going well — that is all.
Remedies, Worship, Devotion & God
No remedies or worship that we perform can please or hurt God. He is far beyond everything we assume about Him.
If you have a small wish (say you want to eat a good apple), this gets fulfilled very easily. We never think of God for this, because we believe it is within our own hands.
When you want to buy a house or a car, for an ordinary person this is a big matter. Going to the bank means visiting a great pilgrimage center and praying for no obstacles. If we have previous life merit, divine grace will be received.
Sometimes even small tasks do not move forward in life. Then we practice planetary pacification, worship of the family deity, chanting, fire rituals, and pilgrimage. If there is previous life merit, these may bear fruit.
Planets — The Bank Security Guard
A thought sometimes occurs to me — are all the worship rituals we perform just attempts to bribe the planets? Can you do everything a security guard at a big bank likes, make him happy, and then take as much cash as you want from that bank?
For any God, for any planet — whether you perform worship, remedies, or vows — it will happen only if you have previous life merit. One must realize that all these methods are merely channels to utilize your stored merit.
Remedies — Medicine — Habit
A remedy should become a habit, not something you do like taking medicine only when a problem comes and then discarding it.
If you are performing a remedy for something, you must not commit the same mistake again in life. Planetary afflictions and life situations do not arise because of anyone else — we ourselves are the cause. The birth chart is merely like a speedometer while driving a car.
Time Never Returns
Every person's identity comes from the work they do — that is the 10th house of Karma. Therefore, the work in one's hands must be done to the fullest of one's ability.
Because we cannot travel back in time to change something done in a particular moment, if we do things right at the time of doing them, there will be no regret about that matter later in life.
Culture — Shodashopachara Worship
In the Shodashopachara (sixteen-step) worship, we invite God to come forward, sit on a seat, worship Him with mantra chanting and devotion, request Him to wash His feet, hands, and face, then offer Him prasadam, then again wash His feet, hands, and face, offer Him betel leaf, and then respectfully bid Him farewell — all performed according to the scriptures.
From this tradition, the practice of service toward other living beings and parents becomes an ingrained habit in life.
Saraswati, Lakshmi & Parvati
Saraswati — Knowledge
If Brahma creates living beings, after being born, a person must learn some skill or knowledge for survival.
Lakshmi — Wealth
If Lord Vishnu is the sustainer, every living being must toil for its livelihood. The hard work that remains after feeding oneself, saved in the form of money — that itself is Sri Mahalakshmi.
Parvati — Food & Liberation
Through hard work alone we obtain food — that is the grace of Annapurna. Ultimately, we merge with Shiva.
Master CVV : Split Karma
Master C.V.V. is regarded as an embodiment of Lord Shiva and a direct divine manifestation. Here, it is enough for us to understand the karma theory he taught.
Split Karma — Through Service Service Path
Suppose you examine a person's horoscope and find that the mother will have health issues. Here, "mother" does not mean only one's own biological mother — any mother is equal to one's own mother. Therefore, whenever time permits on Saturdays and Sundays, one can visit an old age home and serve those who are like mothers.
By doing this, what was supposed to happen severely may happen mildly. (What would have required an axe may be resolved with a fingernail.)
Remedies with Expectations Expectation
Remedies performed like a business transaction never work. "I invested a hundred rupees, so I should get twenty rupees profit." "I spent one lakh rupees on a fire ritual, so my work must definitely get done." Such things never happen. One must fully understand the Karma Theory.
Remedies Through Gurus Guru's Grace
Based on our previous karma, in some cases extraordinary Siddhas and Gurus may appear before us. Even if what they say is a small thing, it is like a liberating mantra. If followed with the same reverence, things will definitely happen as expected. That is why gurus do not give advice to just anyone — there must be a certain worthiness for everything.
Lifestyle Remedies
Since humans are social beings and live among other humans, a remedy should not be like a medicine but should become a habit — that is the right path.
Results come through karma, not because of planets or other forces. This means we must understand that we should perform righteous actions, achieve personal growth, and realize that anything done with expectations is futile.
The Five Elements & Time
The visible elements are the five elements, while the invisible one is time — and it is precious. However we waste it or fail to use it properly, nature returns the consequences to us based on what we do, with corresponding intensity.
Lifestyle Remedy in a Birth Chart Birth Chart
When the 4th house, its lord, the maternal significator Moon, and water signs have weak planetary positions caused by malefic planets, one must learn to respect women and mothers, perform service related to them, avoid wasting water, and help those in need as opportunity permits.
Conclusion
Humans are social beings who live among other humans. Therefore, one must never forget humanity. If our speech is good, our community will be good. Every person will be of help at some point — we must never forget to be grateful to them.
In nature, what we give is what we get back. If we give good, good returns; if we give bad, bad returns. Whatever remedy we perform, we should also see how it benefits other living beings. We must protect nature and the five elements.
On this page Introductionఉపోద్ఘాతం
- Introductionఉపోద్ఘాతం
- Remediesపరిహారాలు
- Karma Theoryకర్మ సిద్ధాంతం
- Hindu Remedies & Zodiacరాశి చక్రం
- Planetary Pacificationగ్రహ శాంతి
- Scientific Perspectiveశాస్త్రీయ దృక్పథం
- God as Accountantదేవుడు లెక్క ఉన్నోడు
- God's Networkదేవుడి నెట్వర్క్
- Worship & Devotionపూజలు, భక్తి
- Saraswati, Lakshmi & Parvatiసరస్వతి లక్ష్మీ పార్వతి
- Master CVV Split KarmaSplit కర్మ
- Lifestyle Remediesలైఫ్ స్టైల్ పరిహారాలు
- Conclusionముగింపు